Content-Length: 584499 | pFad | http://www.uber.com/in/te/drive/driver-app/deactivation-review/

డీయాక్టివేషన్‌లు: ఖాతాకు యాక్సెస్‌ను కోల్పోవడం | Uber
Skip to main content

డ్రైవర్؜లు తమ ఖాతాలకు యాక్సెస్؜ను ఎందుకు కోల్పోతారో అర్థం చేసుకోవడం

ఈ పేజీలో, డ్రైవర్؜లు తమ ఖాతాలకు యాక్సెస్ కోల్పోవడానికి గల అత్యంత సాధారణ కారణాలు, దాన్ని ఎలా నివారించాలి, మరియు మీకు అలా జరిగితే ఏం చేయాలనే విషయాల గురించి సమాచారం ఉంటుంది.

డ్రైవర్؜ల పట్ల మా నిబద్ధత

Uber ప్లాట్؜ఫారమ్؜కు యాక్సెస్؜ను తెరిచి ఉంచి, డ్రైవర్؜లు పని చేయాలనుకున్నప్పుడు వారు ఆన్؜లైన్؜కు వెళ్ళడంలో సహాయపడాలనేది మా బలమైన ప్రేరణ. ఖాతా యాక్సెస్؜ను కోల్పోవడం తరచుగా జరగదు, కానీ అది జరిగినప్పుడు, నిరాశపరుస్తుందని తెలుసు.

మా ప్రక్రియలు న్యాయమైనవి, ఖచ్చితమైనవి మరియు పారదర్శకంగా ఉండేలా చూడటం, డ్రైవర్؜లు విశ్వసించేలా సరైన పని చేయడం మా బాధ్యత. అందుకే మాకు మార్గనిర్దేశం చేయడానికి ఈ క్రింది సూత్రాలను మేం అభివృద్ధి చేసాం:

A black circle labeled with the number

డ్రైవర్؜లు తమ ఖాతా యాక్సెస్؜ను ప్రమాదంలో పడేసే ప్రవర్తనల గురించి తెలుసుకోవాలి.

A black circle labeled with the number

సంవత్సరాలుగా ప్లాట్؜ఫారం؜ను ఉపయోగిస్తున్న డ్రైవర్؜లు, తమ కస్టమర్؜ల మరియు Uber విశ్వాసాన్ని సంపాదించుకున్నారు. తీవ్రమైన సంఘటనలు మినహా యాక్సెస్؜కు సంబంధించిన నిర్ణయాలలో, ప్లాట్؜ఫారమ్؜లో గడిపిన సమయం మరియు ట్రిప్؜ల సంఖ్యను Uber పరిగణించవచ్చు.

A black circle labeled with the number

ఏదైనా యాక్సెస్؜ను కోల్పోవడం జరిగితే, ఇతర వినియోగదారులకు ప్రమాదం కలుగజేసే ఆస్కారం ఉంటే తప్ప, మా కమ్యూనికేషన్؜లలో స్పష్టంగా, సానుభూతితో, మరియు స్థిరంగా ఉండటానికి, అలాగే మా నిర్ణయం వెనుక ఉన్న కారణాల గురించి నిర్దిష్టంగా మరియు పారదర్శకంగా ఉండటానికి Uber అన్ని ప్రయత్నాలు చేస్తుంది.

A black circle labeled with the number

అత్యంత తీవ్రమైన కేసులను మినహాయించి, వారు స్వయంగా పరిష్కరించుకోలేనిది, 7 రోజుల కంటే ఎక్కువ కాలం యాక్సెస్؜ను నిలిపివేసే ఏదైనా నిర్ణయంపై సమీక్షను అభ్యర్థించే సామర్థ్యం డ్రైవర్؜లకు ఉండాలి.

A black circle labeled with the number

ఖాతా డీయాక్టివేషన్ మరియు సమీక్ష ప్రమాణాలను సృష్టించడానికి, సమీక్షించడానికి మరియు అప్؜డేట్ చేయడానికి Uber స్థిరమైన విధానాన్ని అవలంబించాలి.

మా ఖాతా సమీక్ష ప్రక్రియ

మానవ ప్రమేయం

Uber ప్లాట్؜ఫారం భద్రత మరియు సురక్షతను మెరుగుపరచడానికి డేటా మరియు సాంకేతికత ఉపయోగకరమైన సాధనాలు అయినప్పటికీ, డ్రైవర్؜లు మరియు డెలివరీ పార్ట్؜నర్؜ల పట్ల న్యాయంగా వ్యవహరించడంలో, మరియు మోసపూరిత నివేదికల వల్ల వారి ఖాతాలు ప్రభావితం కాకుండా చూడడంలో మాన్యువల్ సమీక్షలు ఎల్లప్పుడూ పాత్ర పోషిస్తాయి.

ముందస్తు నోటీసు

సాధ్యమైన ప్రతిసారీ, వారి ఖాతాకు యాక్సెస్؜ను కోల్పోయే ప్రమాదం ఉన్నప్పుడు, హెచ్చరిక సందేశాల రూపంలో మేం డ్రైవర్؜కు తెలియజేస్తాం. అయితే, చట్టపరమైన లేదా భద్రతా కారణాల వల్ల హెచ్చరిక లేకుండా యాక్సెస్؜ను మేం తొలగించవలసిన సందర్భాలు ఉన్నాయి.

అదనపు సమాచారాన్ని అందించే అవకాశం

ఖాతా డీయాక్టివేషన్؜కు సంబంధించిన సమీక్షను అభ్యర్థించే సామర్థ్యం డ్రైవర్؜లకు ఉండాలి, మరియు తమ కేసును బలపరిచే అదనపు సమాచారం, ఉదాహరణకు ఆడియో లేదా వీడియో రికార్డింగ్‌లను అందించగలగాలి. అందుకే డ్రైవర్؜లు వారి ఖాతా డీయాక్టివేషన్؜లను అప్పీల్ చేయడానికి ఉపయోగించగల ఇన్-యాప్ రివ్యూ సెంటర్؜ను మేం రూపొందించాం.

తప్పుడు ఆరోపణల నుండి రక్షణ

రీఫండ్ పొందే లక్ష్యంతో తరచుగా మా రేటింగ్؜లు లేదా కస్టమర్ సపోర్ట్ సిస్టమ్؜లను దుర్వినియోగం చేసే రైడర్؜లను గుర్తించే ప్రక్రియలను మేం ఏర్పాటు చేసాం. ఈ కస్టమర్؜లు చేసిన ఆరోపణలు ఖాతా డీయాక్టివేషన్ నిర్ణయాలలో పరిగణించబడకుండా ఉండడంలో సహాయపడడానికి మేం పని చేస్తాం.

యాక్సెస్ కోల్పోవడం ఎందుకు జరుగుతుంది, ఏమి చేయాలి

డ్రైవర్ వారి ఖాతాకు యాక్సెస్؜ను కోల్పోవడానికి గల కారణాలలో, గడువు ముగిసిన డాక్యుమెంట్؜లు లేదా వారి బ్యాక్؜గ్రౌండ్ తనిఖీతో సమస్య వంటి సమస్యలు ఉండవచ్చు.

కొన్నిసార్లు, కొన్ని నాణ్యత సమస్యల కారణంగా డ్రైవర్؜లు తమ ఖాతాలకు యాక్సెస్؜ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కోల్పోవచ్చు, ఉదాహరణకు, అసాధారణ అధిక రద్దు రేటు ఉన్నప్పుడు, ట్రిప్؜లను రద్దు చేయమని కస్టమర్؜లను ఒత్తిడి చేయడం, మరియు Uber యాప్ వెలుపల నుండి ట్రిప్؜ను తీసుకోవడం లేదా క్యాష్ రూపంలో చెల్లించమని కస్టమర్؜లను ఒత్తిడి చేయడం లేదా Uber యాప్؜లో చూపిన ఛార్జీలకు అదనంగా నగదును అడగడం వంటివి. అలాంటి సందర్భాలలో, మిమ్మల్ని డ్రైవర్ యాప్ నుండి లాగ్ అవుట్ చేయడానికి ముందు మేం మిమ్మల్ని అనేక సార్లు హెచ్చరిస్తాం.

ఖాతా డీయాక్టివేషన్؜ను సమీక్షించాలని అభ్యర్థించడానికి, మరియు వారి కేసును సమర్థించుకోవడానికి సాక్ష్యాలను అందించగలిగే సామర్థ్యం డ్రైవర్؜లకు ఉండాలి. అందుకే మేం యాప్؜లో ఒక రివ్యూ సెంటర్؜ను రూపొందించాం, దీన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడాన్ని కొనసాగిస్తున్నాం.

తాత్కాలికంగా అయినా సరే, యాక్సెస్ కోల్పోవడం అంతరాయం కలిగించవచ్చు, కాబట్టి మేం ప్రతి రిపోర్ట్؜ను న్యాయంగా మరియు వెంటనే సమీక్షిస్తాం. ఖాతా యాక్సెస్؜ను తిరిగి పొందడానికి తీసుకోవలసిన చర్యలు ఉంటే, మేం వాటిని డ్రైవర్؜కు పంపే సందేశంలో చేర్చుతాం. సహాయం కోసం Uber కస్టమర్ సపోర్ట్ టీమ్ ؜ను ఎప్పుడైనా కాంటాక్ట్ చేయవచ్చు.

డ్రైవర్؜లు ఖాతా యాక్సెస్؜ను కోల్పోవడానికి గల కారణాల గురించి క్రింద మరింత తెలుసుకోండి.

  • డ్రైవర్؜లు అందరూ తప్పనిసరిగా రెగ్యులర్ బ్యాక్؜గ్రౌండ్ స్క్రీనింగ్؜లకు అంగీకరించాలి, ఇందులో వారి మోటారు వాహన రికార్డులు మరియు నేర చరిత్రను మూల్యాంకనం చేయడం జరుగుతుంది. ఖచ్చితమైన అర్హత ప్రమాణాలు వారు ఎక్కడ ట్రిప్؜లు తీసుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటాయి, ఇవి వారి నగరం లేదా రాష్ట్రంలో వర్తించే చట్టాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. బ్యాక్؜గ్రౌండ్ తనిఖీల ఆధారంగా యాక్సెస్ కోల్పోవడానికి గల కొన్ని సాధారణ కారణాలు ఇక్కడ ఉన్నాయి:

    • లైంగిక వేధింపులు, పిల్లలపై లైంగిక నేరాలు, హత్య/ప్రాణనష్టం, ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా మరియు కిడ్నాప్؜తో సహా ఇటీవల చేసిన తీవ్రమైన క్రిమినల్ నేరాలు
    • ఇంకా పెండింగ్؜లో ఉన్న ఏవైనా తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు
    • గత 3 సంవత్సరాలలో, బహుళ ట్రాఫిక్ ఉల్లంఘనలు లేదా ప్రమాదాలు
    • గత 3 సంవత్సరాలలో సస్పెండ్ చేయబడిన లైసెన్స్؜తో డ్రైవింగ్ చేయడం
    • మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం లేదా హిట్-అండ్-రన్ వంటి, ఇటీవల చేసిన ఏదైనా తీవ్రమైన డ్రైవింగ్ ఉల్లంఘన

    స్థానికంగా వర్తించే నిబంధనలు, చట్టాలు మరియు ఆచరణలను బట్టి, 18 సంవత్సరాల వయస్సు నుండి ప్రారంభించి, డ్రైవర్؜కు సంబంధించిన మొత్తం వయోజన చరిత్ర, బ్యాక్؜గ్రౌండ్ తనిఖీలలో భాగంగా ఉండవచ్చు.

  • రియల్-టైమ్ ID తనిఖీలో విఫలమవ్వడం
    మా స్క్రీనింగ్ తనిఖీలలో పాస్ అయిన వ్యక్తి గుర్తింపుతో, డ్రైవింగ్ చేసే వ్యక్తి సరిపోలుతున్నాడని నిర్ధారించుకోవడానికి Uber రియల్-టైమ్ ID తనిఖీని ఉపయోగిస్తుంది. రియల్ టైమ్ ఫోటో తప్పనిసరిగా వారి ప్రొఫైల్ ఫోటోతో సరిపోలాలి. రైడర్؜ల భద్రతను నిర్ధారించడానికి, డ్రైవర్؜లు తమ ఖాతాను ఇతరులతో పంచుకోవడానికి లేదా దానిని మరెవరికీ అప్పగించడానికి అనుమతించబడరు.

    రియల్-టైమ్ ID తనిఖీలో జరిగే సాధారణ తప్పులకు ఉదాహరణలు

    • ఖాతా యజమాని కాకుండా వేరొకరిని రియల్ టైమ్ ఫోటో తీసుకోవడానికి అనుమతించడం
    • ఫోటోను ఫోటో తీసి సబ్మిట్ చేయడం
    • యాప్؜లోని ఫ్రేమ్؜లో ముఖం మరియు మెడను సమలేఖనం చేస్తూ, స్పష్టంగా, బాగా ప్రకాశవంతంగా ఉండే ఫోటో తీసుకోకపోవడం
    • డ్రైవర్ రూపురేఖలు మారిపోయి ఉంటే, ప్రొఫైల్ ఫోటోను అప్؜డేట్ చేయకపోవడం

    ఫోటో ధృవీకరణ గురించి మరింత తెలుసుకోండి


    అసురక్షిత డ్రైవింగ్
    ట్రిప్ సమయంలో డ్రైవర్ ప్రమాదానికి గురైనట్లు లేదా ట్రాఫిక్ ఉల్లంఘన చేసినట్లు తెలిపే రిపోర్ట్؜లు, లేదా డ్రైవర్ యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు తగని, అసురక్షిత లేదా అశ్రద్ధ డ్రైవింగ్‌؜కు సంబంధించి పదే పదే వచ్చిన రిపోర్ట్؜లు ఇందులో భాగం.


    మద్యం సేవించి లేదా నిద్రలేమితో డ్రైవింగ్
    నిద్రమత్తులో డ్రైవింగ్ చేసినప్పుడు లేదా మద్యం, అక్రమ మాదకద్రవ్యాలు లేదా మోటారు వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఉపయోగించకూడని ఓవర్-ది-కౌంటర్ లేదా ప్రిస్క్రిప్షన్ మందుల ప్రభావంలో చేసిన డ్రైవింగ్؜కు సంబంధించిన రిపోర్ట్؜లు ఇందులో భాగం. కారులో డ్రగ్స్ మరియు/లేదా తెరిచి ఉంచిన ఆల్కహాల్ కంటైనర్؜లకు సంబంధించిన రిపోర్ట్؜లు కూడా ఇందులో భాగం. మద్యం లేదా డ్రగ్స్ వాసనలు—మునుపటి ప్రయాణికుల వల్ల వచ్చేవి అయినా సరే—హాని కలుగజేసేదిగా భావించబడవచ్చు. దర్యాప్తు జరుగుతున్న సమయంలో, చట్టం ప్రకారం, ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయాల్సిన అవసరం Uberకి ఉంటుంది.


    వాగ్వాదాలు మరియు వేధింపులు
    దూకుడుగా, ఘర్షణకు దిగేలా లేదా వేధించేలా ప్రవర్తించడం. ఇందులో ఇవి ఉంటాయి:

    • అగౌరవపరిచే విధంగా ఉండే, బెదిరింపులా ఉండే, లేదా అనుచితంగా ఉండే, భాషను ఉపయోగించడం, సంజ్ఞలు చేయడం లేదా చర్యలు తీసుకోవడం
    • Uber ఆన్؜లైన్ సపోర్ట్ సిస్టమ్؜ల ద్వారా లేదా Uber ప్లాట్؜ఫారమ్ అనుభవానికి సంబంధించి లైంగిక పరంగా స్పష్టంగా ఉన్న, లేదా శారీరక హింసను ప్రతిబింబించే గ్రాఫిక్ చిత్రాలను అయాచితంగా పంచుకోవడంతో సహా, Uber కమ్యూనిటీలోని ఇతరులతో అటువంటి చిత్రాలను పంచుకోవడం


    లైంగిక దుష్ప్రవర్తన లేదా దాడి
    డ్రైవర్؜లు, రైడర్؜లు మరియు థర్డ్ పార్టీలతో పాటూ, ఎవరైనా చేసే లైంగిక దాడి మరియు లైంగిక దుష్ప్రవర్తనతో సహా, ఎలాంటి లైంగిక వేధింపులు Uber ఉపయోగిస్తున్నప్పుడు అనుమతించబడవు, మరియు అలా చేయడం చట్టవిరుద్ధం కూడా కావచ్చు. లైంగిక దాడి అనేది సమ్మతి లేకుండా శారీరక లైంగిక చర్యకు లేదా ప్రయత్నించిన శారీరక లైంగిక చర్యకు పాల్పడడం, ఉదాహరణకు సమ్మతి లేకుండా తాకడం, ముద్దు పెట్టుకోవడం లేదా శృంగారం వంటివి. శారీరకంగానే కాకుండా, సమ్మతి లేకుండా చేసే లైంగిక లేదా రొమాంటిక్ చర్యలు, ఏవైతే ఎవరికైనా ముప్పు కలుగజేసే విధంగా లేదా భయపెట్టే విధంగా ప్రభావం చూపుతాయో, అవి కూడా లైంగిక దుష్ప్రవర్తనలో భాగమే. డ్రైవర్ లేదా డెలివరీ పార్ట్؜నర్؜కు ఇతర వ్యక్తి పరిచయం ఉన్నా లేకపోయినా, లేదా వారి అనుమతి పొందినా పొందకపోయినా, Uber లైంగిక సంబంధాల నిషేధ నిబంధన, లైంగిక సంపర్కాన్ని నిషేధిస్తుంది.


    తప్పు డ్రైవర్
    మీకు చెందని ఖాతా నుండి మీరు వాహనాన్ని డ్రైవ్ చేస్తుంటే, లేదా మీ ప్రొఫైల్ నుండి మరెవరినైనా డ్రైవ్ చేయడానికి మీరు అనుమతిస్తుంటే, మీరు మీ ఖాతాకు యాక్సెస్؜ను కోల్పోవచ్చు. ఇది భద్రతను దృష్టిలో పెట్టుకుని చేసింది. అలాంటి సంఘటనలపై రైడర్؜లు ఫిర్యాదు చేయవచ్చు, ఇది ఖాతా యాక్సెస్؜ను కోల్పోవడానికి దారి తీయవచ్చు.


    ఆమోదించని వాహనాల ఉపయోగం
    డ్రైవర్ ప్రొఫైల్؜తో అనుబంధించబడిన, మరియు వారి నగరానికి సంబంధించిన కనీస ఆవశ్యకతలకు అనుగుణంగా ఉండే వాహనాలు లేదా ఇతర రవాణా పద్ధతులు మాత్రమే ఆమోదయోగ్యమైనవి.

    ఆమోదించని వాహనాలకు సంబంధించిన సాధారణ తప్పుల ఉదాహరణలు

    • Uberకి అప్؜డేట్ చేసిన వాహన సమాచారాన్ని అందించకపోవడం

    వాహన ఆవశ్యకాల గురించి మరింత తెలుసుకోండి


    అసురక్షిత వాహనాలు
    పరిశ్రమ భద్రత మరియు నిర్వహణ ప్రమాణాలకు అనుగుణంగా వాహనాన్ని నిర్వహించకపోవడం ఇందులో భాగం. ఉదాహరణకు, బ్రేక్؜లు, సీట్ బెల్ట్؜లు మరియు టైర్؜లు సరిగ్గా పని చేసేలా ఉంచకపోవడం; రీకాల్؜లను విస్మరించడం; మరియు డ్యాష్؜బోర్డ్ చూపే హెచ్చరిక లైట్؜లను విస్మరించడం.

  • మా ప్లాట్‌ఫారం సక్రమంగా మరియు సురక్షితంగా పనిచేయడానికి, Uber ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించే ప్రతి ఒక్కరూ మా నిబంధనలను పాటించాలని మరియు మోసపూరిత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మేం ఆశిస్తాం. Uberను ఉపయోగించే ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే మోసాలను నివారించడానికి మరియు గుర్తించడానికి మేం నిత్యం కృషి చేస్తున్నాం.

    మా నియమనిబంధనలను ఉల్లంఘించే మోసపూరిత కార్యాచరణను గుర్తించడానికి, మోసంను గుర్తించే నిపుణుల సమీక్షలతో సహా, ఆటోమేటెడ్ మరియు మాన్యువల్ సిస్టమ్؜లపై Uber ఆధారపడుతుంది. కొన్ని సందర్భాల్లో, అలాంటి యాక్టివిటీ వల్ల వినియోగదారుడి ఖాతా డీయాక్టివేట్ అవుతుంది.


    ఖాతా డీయాక్టివేషన్؜కు దారితీసే మోసపూరిత కార్యకలాపాలలో ఇవి ఉంటాయి, కానీ వీటికి మాత్రమే పరిమితం కావు:

    • ఉద్దేశపూర్వకంగా ట్రిప్ సమయం లేదా దూరాన్ని పెంచడం
    • ట్రిప్ అభ్యర్థనలను పూర్తి చేయాలనే ఉద్దేశ్యం లేకుండా అంగీకరించడం, వినియోగదారులు రద్దు చేసేలా చేయడంతో సహా
    • నకిలీ, డూప్లికేట్ లేదా సరికాని ఖాతాలను సృష్టించడం
    • అసమంజసమైన ఫీజులు లేదా ఛార్జీలను క్లెయిమ్ చేయడం, ఛార్జీలో చేర్చినా కూడా, కస్టమర్؜ల నుండి పార్కింగ్ ఫీజు అడగడం లాంటివి
    • మోసపూరిత లేదా తప్పుడు ట్రిప్؜లను ఉద్దేశపూర్వకంగా అభ్యర్థించడం, ఆమోదించడం లేదా పూర్తి చేయడం
    • డెలివరీ ఐటెమ్؜ను అసలు పికప్ చేసుకోకుండానే డెలివరీని పూర్తి చేసినట్లు క్లెయిమ్ చేయడం
    • డెలివరీ ఐటెమ్؜ను పికప్ చేసుకుని, ఐటెమ్؜లోని మొత్తం లేదా కొంత భాగాన్ని తమ వద్దే ఉంచుకోవడం, మరియు మొత్తం ఆర్డర్؜ను డెలివరీ చేయకపోవడం
    • ప్లాట్؜ఫారమ్ మరియు GPS సిస్టమ్ సరైన పనితీరును నిరోధించడానికి లేదా దాటవేయడానికి, అనధికార లేదా మార్పులు చేసిన పరికరాలు, యాప్؜లు లేదా ప్రోగ్రామ్؜లను వాడడంతో సహా, Uber ప్లాట్؜ఫారమ్ సాధారణ కార్యాచరణకు భంగం కలిగించడం లేదా తారుమారు చేయడం
    • ప్రమోషన్؜లు లేదా రెఫరల్؜ల వంటి ఏదైనా ప్రోగ్రామ్؜ను దుర్వినియోగం చేయడం లేదా ఉద్దేశించిన ప్రయోజనం కోసం వాటిని ఉపయోగించకపోవడం
    • మోసపూరిత లేదా చట్టవిరుద్ధమైన కారణాలతో ఛార్జీలను వివాదం చేయడం
    • తప్పుడు డాక్యుమెంటేషన్


    మోసపూరిత డాక్యుమెంట్؜లు
    మార్చిన లేదా తప్పుడు డాక్యుమెంట్؜లు అనుమతించబడవు.

    మోసపూరిత డాక్యుమెంట్؜లకు సంబంధించి చేసే సాధారణ తప్పుల ఉదాహరణలు

    • అసలు డాక్యుమెంట్؜ల బదులు ఫోటోకాపీలు, స్కాన్ చేసిన డాక్యుమెంట్؜లు లేదా ఫోటో తీసిన ఫోటోలను సబ్మిట్ చేయడం
    • భౌతికంగా లేదా డిజిటల్؜గా డాక్యుమెంట్؜లను మార్చడం (క్రాస్-అవుట్؜లు/వైట్-అవుట్؜లు, అనవసరమైన చేతివ్రాత మరియు ఇతర మార్పులు వంటివి)
    • డాక్యుమెంట్؜ల ఫోన్ స్క్రీన్ షాట్؜లను సబ్మిట్ చేయడం
    • పూర్తిగా కనిపించని మరియు స్పష్టంగా లేని డాక్యుమెంట్؜ను సబ్మిట్ చేయడం


    గుర్తింపుకు సంబంధించిన మోసం
    ఇందులో, డ్రైవర్ తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం, మరొకరి గుర్తింపును వాడుకోవడం, వేరొకరితో ఖాతాను పంచుకోవడం, తమకు చెందని వ్యక్తిగత డాక్యుమెంట్؜లను సబ్మిట్ చేయడం, లేదా గుర్తింపు ధృవీకరణ తనిఖీలను దాటవేయడానికి ప్రయత్నించడం ఉంటాయి.

    గుర్తింపు మోసానికి సంబంధించిన సాధారణ తప్పుల ఉదాహరణలు

    • Uberకు సబ్మిట్ చేసిన పూర్తి చట్టపరమైన పేరు, పుట్టిన తేదీ, గుర్తింపు సంఖ్య మరియు ఇతర ఖాతా సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించుకోకపోవడం
    • తాము కానటువంటి వ్యక్తిని, తాముగా ప్రాతినిధ్యం వహించే డ్రైవర్
    • వారికి చెందని మరియు వాడేందుకు అనుమతి లేని డాక్యుమెంట్؜లను సబ్మిట్ చేయడం
    • వారి ఖాతాను వేరొకరితో పంచుకోవడం (రైడర్؜ల భద్రత దృష్ట్యా, డ్రైవర్؜లు తమ ఖాతాను వేరొకరితో పంచుకోవడానికి లేదా దానిని మరొకరికి అప్పగించడానికి అనుమతించబడరు)


    మోసపూరిత నకిలీ ఖాతాలు
    సరికాని నకిలీ ఖాతాలను సృష్టించకూడదు. డ్రైవర్؜కు వారి ఖాతాలోకి సైన్ ఇన్ చేయడంలో, లేదా ప్లాట్؜ఫారమ్؜ను ఉపయోగించడంలో సమస్య ఉంటే, వారు నకిలీ ఖాతాను సృష్టించకుండా, సపోర్ట్؜ను కాంటాక్ట్ చేయాలి.


    ఆర్థిక మోసం
    మోసపూరిత ఆర్థిక కార్యాచరణలో, ట్రిప్ సమయం లేదా దూరాన్ని అక్రమంగా, ఉద్దేశపూర్వకంగా పెంచడం లేదా ఫీజులు మరియు ప్రమోషన్؜లను దుర్వినియోగం చేయడం వంటివి ఉంటాయి, కానీ వీటికే పరిమితం కాదు.

    ఆర్థిక మోసానికి సంబంధించి సాధారణంగా చేసే తప్పులకు ఉదాహరణలు

    • రైడర్؜లు ట్రిప్؜ను రద్దు చేసేలా చేయడం
    • ట్రిప్ సమయం లేదా దూరాన్ని పెంచడం
    • ఫీజులు లేదా రీఫండ్؜ల కోసం తప్పుడు క్లెయిమ్؜లను సబ్మిట్ చేయడం లేదా ఆఫర్؜లు మరియు ప్రమోషన్؜లను దుర్వినియోగం చేయడం
    • ట్రిప్ ప్రారంభించడానికి ముందు ఫోన్ చేసి, యాప్‌లో ట్రిప్ రద్దు చేసి, ఆఫ్‌లైన్‌లో చేయడం (డ్రైవర్؜లకు నగదు రూపంలో చెల్లించి) వంటి Uber కమ్యూనిటీ మార్గదర్శకాలకు విరుద్ధమైన పనులు చేయమని డ్రైవర్‌ను కోరే రైడర్؜లతో సహకరించడం

  • డ్రైవర్, వారి ఖాతాకు యాక్సెస్؜ను ఈ సందర్భాలలో కోల్పోవచ్చు:

    • జాతి, రంగు, వైకల్యం, లింగ గుర్తింపు, వైవాహిక స్థితి, గర్భధారణ, జాతీయ మూలం, వయస్సు, మతం, లింగం, లైంగిక ధోరణి లేదా సంబంధిత చట్టం ద్వారా రక్షణ పొందిన మరేవైనా ఇతర లక్షణాలపై వివక్ష చూపడం లేదా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం
    • వీల్ చెయిర్؜లు లేదా ఇతర సహాయకర పరికరాల కారణంగా, రైడర్؜ల ట్రిప్؜లను తిరస్కరించడం లేదా రద్దు చేయడం

    మరింత తెలుసుకోండి


    వివక్షకు సంబంధించి సాధారణంగా చేసే తప్పుల ఉదాహరణలు

    • వీల్ చెయిర్؜లు లేదా వాకర్؜ల వంటి సహాయక పరికరాలను కారులో సరిపోయేలా అమర్చడంలో సహాయం చేయడానికి నిరాకరించడం. కారు ట్రంక్‌లో అమర్చడానికి, ఈ పరికరాలను తరచుగా మడవవచ్చు లేదా విడదీయవచ్చు.
    • జాతి, రంగు, వైకల్యం, లింగ గుర్తింపు, వైవాహిక స్థితి, గర్భధారణ, జాతీయ మూలం, వయస్సు, మతం, లింగం మరియు లైంగిక ధోరణి వంటి ఒకరి వ్యక్తిగత లక్షణాల గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేయడం.

  • తమ నగరంలోని కనీస సగటు రేటింగ్ కంటే తక్కువగా ఉన్న రేటింగ్؜ల వల్ల Uber ప్లాట్؜ఫారమ్؜లో కొంత భాగానికి, లేదా మొత్తం Uber ప్లాట్؜ఫారమ్؜కి డ్రైవర్ యాక్సెస్؜ను కోల్పోవచ్చు. వారి రేటింగ్ కనీస పరిమితిని సమీపిస్తుంటే, మేం వారికి తెలియజేస్తాం, రైడర్؜ల నుండి వారి రేటింగ్؜ను మెరుగుపరుచుకోవడంలో సహాయపడే సమాచారాన్ని వారితో పంచుకుంటాం.


    డ్రైవర్؜లకు వనరులు
    డ్రైవర్ రేటింగ్؜లు అంటే రైడర్؜లు అందజేసిన చివరి 500 రేటింగ్؜ల సగటు. వారి రేటింగ్؜ను ప్రభావితం చేసే విషయాలు డ్రైవర్ నియంత్రణలో లేనివి కూడా ఉంటాయని మేం అర్థం చేసుకున్నాం. మితిమీరిన ప్రతికూల లేదా పక్షపాత రైడర్؜లు అందించిన రేటింగ్؜లను, డ్రైవర్ నియంత్రణలో లేని ఫీడ్؜బ్యాక్؜తో వచ్చిన రేటింగ్؜లను మినహాయించే వ్యవస్థను మేం ఏర్పాటు చేసాం. ఇక్కడమరింత తెలుసుకోండి.

    డ్రైవర్؜లు, రైడర్؜ల నుండి తక్కువ రేటింగ్؜లను ఎలా నివారించవచ్చు
    కోర్సు తీసుకోవడం ద్వారా డ్రైవర్؜లు రైడ్؜లకు యాక్సెస్؜ను ఎలా తిరిగి పొందగలరు


  • డ్రైవర్؜లు తమ ఖాతాకు యాక్సెస్؜ను కోల్పోవడానికి గల సాధారణ కారణాలను ఈ పేజీ వివరిస్తుంది. ప్లాట్؜ఫారంలోని వినియోగదారులు అందరూ (రైడర్؜లతో సహా) ఇలాంటి కారణాల వల్ల యాక్సెస్؜ను కోల్పోవచ్చు. వినియోగదారులు ఖాతా యాక్సెస్ కోల్పోవడానికి సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి మా కమ్యూనిటీ మార్గదర్శకాలను చూడండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

  • మిమ్మల్ని ప్లాట్؜ఫారం؜ నుండి తిరస్కరించి ఉంటే, యాప్؜లో రివ్యూ సెంటర్ లైవ్ ఉంది. అక్కడ మీరు సమీక్షను అభ్యర్థించి, వీడియో మరియు ఆడియో రికార్డింగ్؜లు, ఫోటోలతో సహా సంబంధిత సహాయక సమాచారాన్ని అప్؜లోడ్ చేయవచ్చు.

  • ఏజెంట్లు Uber యాప్ ద్వారా చేసిన ఆడియో రికార్డింగ్؜లను సమీక్షించగలుగుతారు. అక్కడ మీరు సమీక్షను అభ్యర్థించి, వీడియో మరియు ఆడియో రికార్డింగ్؜లు, ఫోటోలతో సహా సంబంధిత సహాయక సమాచారాన్ని అప్؜లోడ్ చేయవచ్చు.

  • కేసును బట్టి సమీక్ష సమయం భిన్నంగా ఉండవచ్చు. డ్రైవర్ సమీక్ష అభ్యర్థనను సమర్పించిన తర్వాత, వారికి ప్రాసెసింగ్ సమయం మరియు స్థితి గురించి తెలియజేయబడుతుంది. సమీక్ష జరుగుతున్న సమయంలో ఖాతాలు డీయాక్టివేట్ చేయబడి ఉంటాయి.

  • లేదు. మేం తరచూ ఎదుటి పక్షానికి మద్దతుగా ఉంటామని డ్రైవర్؜లు భావిస్తారని మేం అర్థం చేసుకున్నాం, కానీ Uberను ఉపయోగించే ప్రతి ఒక్కరూ ఒకే కమ్యూనిటీ మార్గదర్శకాలను అనుసరిస్తారు. రీఫండ్؜లు లేదా తగ్గింపులను పొందడానికి కొంతమంది మా రేటింగ్ మరియు కస్టమర్ సపోర్ట్ సిస్టమ్؜లను దుర్వినియోగం చేయడమనేది దురదృష్టకర వాస్తవం. ఈ కస్టమర్؜లను సరిగ్గా గుర్తించడానికి, మరియు వారి ఆరోపణలు ఖాతా డీయాక్టివేషన్ నిర్ణయాలలో పరిగణించబడకుండా చూసుకోవడంలో సహాయపడటానికి మేం ప్రాసెస్؜లను ఏర్పాటు చేసాం.

విధాన ఉల్లంఘనలు: ఖాతా యాక్సెస్؜ను కోల్పోవడానికి గల సాధారణ కారణాలను ఈ పేజీ వివరిస్తుంది, కానీ ఒక డ్రైవర్ Uberతో వారి కాంట్రాక్చువల్ ఒప్పందానికి సంబంధించిన ఏవైనా నిబంధనలను, లేదా కమ్యూనిటీ మార్గదర్శకాలతో సహా, వర్తించే ఏవైనా నిబంధనలు లేదా విధానాలను ఉల్లంఘిస్తే, వారు మొత్తం Uber ప్లాట్؜ఫారమ్؜కు లేదా Uber ప్లాట్؜ఫారమ్؜లో కొంత భాగానికి యాక్సెస్؜ను కోల్పోవచ్చు. తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, డ్రైవర్ అందుకోవలసిన ఏదైనా మొత్తం నుండి, ప్లాట్‌ఫారమ్ దుర్వినియోగానికి సంబంధించిన నష్టాలను తగ్గించడానికి, పరిహారం చేయడానికి, లేదా తిరిగి వసూలు చేయడానికి మాకు హక్కు ఉంటుంది. అనుచిత ప్రవర్తన అనుమానించబడినప్పుడు, తగ్గించబడే, పరిహారంగా చెల్లించబడే, లేదా ఛార్జ్ చేయబడే మొత్తాలకు ఉదాహరణలు (కానీ వీటికే పరిమితం కాదు) ఫీజులు, ప్రమోషన్؜లు, రిఫరల్ విలువలు, ప్రమోషనల్ కోడ్؜లు, ట్రిప్ ధరలు, ట్రిప్ సర్దుబాటు ధరలు, రద్దు ఫీజులు, ప్రమోషనల్ ట్రిప్ ధరలు, మరియు ఇతర వివిధ చెల్లింపులు.









ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: http://www.uber.com/in/te/drive/driver-app/deactivation-review/

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy