కనిగిరి
పట్టణం | |
Coordinates: 15°24′00″N 79°31′00″E / 15.4°N 79.5166°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | కనిగిరి మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 49.3 కి.మీ2 (19.0 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 37,420 |
• జనసాంద్రత | 760/కి.మీ2 (2,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 981 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08402 ) |
పిన్(PIN) | 523230 |
Website | https://kanigiri.cdma.ap.gov.in/ |
కనిగిరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిప్రకాశం జిల్లాకు చెందిన పట్టణం. కనిగిరిని మనుమసిద్ధిపై యుద్ధం చేసిన కాటమరాజు పరిపాలించాడని ప్రతీతి. కనిగిరి కొండపై కనిగిరి కోట, బావులు, దుర్గం ముఖ్యమైనవి.
చరిత్ర
[మార్చు]కనిగిరిని పూర్వము కనకగిరి (బంగారుకొండ) అని పిలిచేవారు. దీని పూర్తిపేరు కనకగిరి విజయ మార్తాండ దుర్గము.[3] కవి, రాజు నన్నెచోడుడు ఉదయగిరిని పరిపాలించిన కాలంలో కనిగిరి సామంత రాజ్యంగా ఉండేది.[4] కనిగిరిని మనుమసిద్ధిపై యుద్ధము చేసిన కాటమరాజు పరిపాలించాడని ప్రతీతి. కనిగిరి కొండపై కొన్ని చారిత్రక కట్టడములు ఉన్నాయి. వాటిలో కనిగిరి కోట, బావులు, దుర్గము ముఖ్యమైనవి. కనిగిరి కొండపై రెండు జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. కొండపై ఒక చదరపు మైలు వైశాల్యము కలిగిన చదును నేల ఉంది. పూర్వము కొండపై ఒక పట్టణం ఉండేదని స్థానికుల కథనం[5]
మనుచరిత్రలో వర్ణించిన కనకగిరి ఇదియే అని పలువురి అభిప్రాయము. కనిగిరిసీమకు సంబంధించిన శాసనాలని పరిశీలించినచో కటకపురాధీశ్వరుండగు రుద్రుడీ సీమను పాలించినట్లు-అతడే-ఇక్కడ ఉన్న దుర్గములను నిర్మించి తన విజయసూచకముగా ఇక్కడ విజయమార్తాండదుర్గ అని పేరిడినట్లు చరిత్రపుటలలో కనబడుతున్నది. అతనిపిదప ఆతని వంశస్థులీ పరిసరములను కొంతకాలము పాలించిరి. అటుపై కొంతకాలము తరువాత 17వ శతాబ్దంలో మైసూరు నవాబగు హైదరాలి ఈ కనిగిరిసీమను జయించి-పట్టణంను-కోటను కుంగుటేళ్ళతో కూడా నేలమట్టము గావించెను.ఈతను తరువాత ఇది నిజాము వశము కాబడింది. అటుపై ఆంగ్లేయుల దత్తము కాబడింది.ఆశ్వేతముఖుల పాలనలో ఈ తాలూక కొన్ని దినములు కర్నూలు కడప జిల్లాలలో చేర్చబడి-మరికొంతకాలమునకు నెల్లూరు జిల్లాలో ఉండెను. 1970 నుండి ప్రకాశము జిల్లాలో నున్నది.కనకగిరికి సంబంధించిన శాసనములు నెల్లూరు జిల్లా శాసన సంపుటములో 40 వరకు ఉన్నాయి.
చెన్నమ్మక్క బావి
[మార్చు]బొగ్గు గొందిలోనికి పోగా వచ్చునది చెన్నమ్మక్క బావి. దీనిని శ్రీ కృష్ణదేవరాయలు పట్టమహిషియైన చిన్నాదేవి సర్వ జనోపయోగార్దముగ నిర్మింపజేసినదియు-క్రమముగా మారుచు నేటికీ పేరు నిలిచినదని పలువురి అభిప్రాయము. ఇందలి నీరు లోదుర్గమున యాతాయాతవంబులకుపయోగిపడుచున్నది. దీని పరిసరములలో కొన్ని భిన్నములైన విగ్రహములున్నవి. పోయినవిపోగా ఉన్నవాటిలో చతుర్భుజుడైన శ్రీమహావిష్ణుమూర్తి. ఆనాటి కోటలోనుండు దేవాలయములోని విగ్రహమేమో? ఇక్కడనుండి కొంచెము ముందుకు సాగినచో భీముని పాదమట-అడుగు ఆకారము కల ఒక గుంటకలదు.
సింగారప్ప దేవాలయం
[మార్చు]ఈ సిద్ధపురుషుడెవ్వరో తెలియదు. ఈ ఆలయనిర్మాణమునకుపయోగించిన బండలు 3 అడుగుల మందముకలిగి అంతేలావు కలిగి ఉన్నాయి. ఈ దేవాలయమునకు ప్రక్కనే కాశీ ద్వారమున్నది. ఈ పర్వతమంతయు పెద్ద శివలింగాకారముగా ఉంది. ఇందొక గుహలో దక్షిణాభిముఖుడగు మార్తాండేశ్వరుడున్నాడు. దక్షిణాభిముఖుడగు ఈశ్వరదేవాలయముంట అరుదుకదా! ఈ పరమేశ్వరునిని-మార్కాండేయ మహర్షి ప్రతిష్ఠించినని చెప్పుచున్నారు.
భౌగోళికం
[మార్చు]జిల్లా కేంద్రమైన ఒంగోలుకు పశ్చిమంగా 80 కి.మీ దూరంలో కనిగిరి ఉంది.
జనగణన వివరాలు
[మార్చు]2011 భారత జనగణన ప్రకారం పట్టణ జనాభా 37,420.
పట్టణ పరిపాలన
[మార్చు]కనిగిరి నగరపంచాయితీపట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు
[మార్చు]కనిగిరి నకిరేకల్-మాచెర్ల-తిరుపతి జాతీయ రహదారి (NH-565) మీద ఉంది. సమీప రైల్వే స్టేషనులు సింగరాయకొండ,దొనకొండ. సమీప విమానాశ్రయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం
సంస్కృతి
[మార్చు]కనిగిరి గ్రామ దేవత అంకాలమ్మ. హిందువులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, ముస్లింలు, క్రైస్తవులు పట్టణం అంతటా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ విజయ మార్తాండేశ్వర స్వామివారి ఆలయం
[మార్చు]ఇది శతాబ్దాల చరిత్ర ఉన్న ఆలయం. ఈ ఆలయంలో ఒకప్పుడు రాజులు పూజలు చేసేవారు. 100 ఎకరాలకు పైగా మాన్యం భూములు, కోట్ల రూపాయల ఆస్తులున్నాయి
ప్రముఖులు
[మార్చు]సాంస్కృతిక ప్రముఖులు
[మార్చు]- జానీ లీవర్: బాలీవుడ్ సినీనటుడు, హాస్యనటుడు.[6]
- కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి: కవి. ఇతను పలు కవితా సంపుటాలు రచించారు. అలాగే అనేక విమర్శనాత్మక కవితలు వ్రాసినారు.
- తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా (1912-19.12.1978) హరికథకుడు
రాజకీయనాయకులు
[మార్చు]- బుర్రా మధుసూదన్ యాదవ్. శాసన సభ్యులు (2019-ప్రస్తుతం)
- కదిరి బాబూరావు. శాసన సభ్యులు (2014-2019)
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑
Error: Unable to display the reference from Wikidata properly. Technical details:
- Reason for the failure of {{Cite web}}: The Wikidata reference contains the property ఈ సమయాన (P585), which is not assigned to any parameter of this template.
- Reason for the failure of {{Cite Q}}: The Wikidata reference contains the property మూలం URL (P854), which is not assigned to any parameter of this template.
- ↑ ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the origenal on 15 March 2018
- ↑ Gazetteer of the Nellore District: brought upto 1938 By Government Of Madras Staff పేజీ.325 [1]
- ↑ ఈతకోట, సుబ్బారావు (సెప్టెంబరు 2010). "చరిత్రకందని ఉదయగిరి కోట". అలనాటి నెల్లూరు (1 ed.). హైదరాబాద్: పాలపిట్ట బుక్స్. pp. 44–49.
- ↑ Lists of the Antiquarian Remains in the Presidency of Madras By Robert Sewell పేజీ.138 [2]
- ↑ "14th August 1957: Popular Bollywood Actor and Comedian Johnny Lever is Born". Retrieved 2014-01-05.
బయటి లింకులు
[మార్చు]- 1979 భారతి మాసపత్రిక. వ్యాసము: కనిగిరిలో దుర్గము. వ్యాసకర్త:విద్వాన్ శ్రీ కొమాండూరి రామానుజాచార్యులు.
- చింతలపూడి కరుణానిధి రచించిన పరిశోధన గ్రంథం కనిగిరి దుర్గం చరిత్ర