Content-Length: 196289 | pFad | https://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%8C%E0%B0%AE%E0%B1%8D

సౌమ్ - వికీపీడియా Jump to content

సౌమ్

వికీపీడియా నుండి
వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

సౌమ్ (అరబ్బీ : صوم) అనగా ఉపవాసం. ఇస్లాం ఐదు మూలస్థంభాలలో మూడవది.

ఉపవాసవ్రతం : ఖురాన్ ప్రకారం రమదాన్ నెలలో విధిగా అచరించవలసిన నియమం ' ఉపవాసాలు ' . ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో "రోజా "అని అంటారు. అరబ్బీ భాషలో "సౌమ్" అని పిలుస్తారు.తెలుగులో ఉపవాసం అనవచ్చు.

ఈ ఉపవాస విధిని గురించి దివ్య ఖురాన్ గ్రంథం .

" విశ్వాసులారా! గత దైవ ప్రవక్తలను అనుసరించే వారికి ఎలా ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయో.......... అలాగే మీలో భయభక్తులు జనించిడానికి అదేవిధంగా ఇప్పుడు మీకు కూడా ఉపవాసవ్రతాలు నిర్ణయించబడ్డాయి " అని పేర్కొంది.

నిష్ట నియమాలు

[మార్చు]

రమదాన్ మాసం ప్రారంభమైన నాటి నుండి ముగిసేవరకూ ముస్లింలు పగలు నిష్టగా రోజా ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం ఆహార పానీయాలను మానివేయడం మాత్రమే 'రోజా ' కాదు. నిష్టనియమాలతో కూడుకున్న జీవన విధానం అది. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు భోజనం (సెహరి) చేసిన తరువాత ఆ రోజంతా ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీక్షను "ఇఫ్తార్" ద్వారా విరిమిస్తారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని " సహర్ " అనీ, సాయంత్రం ఉపవాస వ్రతదీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని " ఇఫ్తార్ " అని అంటారు. అంటే రమదాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నుంచి సూర్యాస్తమయం వరకు సుమారు 13 గంటలుపాటు కఠిన ఉపవాసదీక్షలు పాటిస్తారు. ఉపవాసదీక్ష పాటించేవారు అబద్ధం ఆడకుండా, పరనిందకు పాల్పడకుండా గడపడంతో పాటూ, శారీరక, మానసిక వాంఛలకు దూరంగా, నిగ్రహంతో వుంటూ ఆసాంతం దైవచింతనతో గడుపుతూ వుంటారు. ఈ ఉపవాస దీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతి, దేవుడిపట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణాలను పెంపొందింపజేయడమే! దీనిని ఖురాన్ ' తఖ్వా ' అని అంటుంది.

ఓ మస్జిద్ లో ఉపవాస దీక్ష తీర్చు సన్నివేశం

ఉపవాస విధి

[మార్చు]

రమదాన్ మాసం ఉపవాసదీక్షలను పూర్తినెలరోజుల పాటు పాటించడం అనేది వయోజనులైన స్త్రీపురుషులందరికీ విధిగా నిర్ణయించబడింది. అయితే వృద్దులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, ప్రయాణంలో వున్నవారు ఈ విధి నుండి మినహాయింపబడ్డారు. దివ్యఖురాన్ ఉపవాస విధిని గురించి ' రమదాన్ నెలలో విధిగా నెలంతా ఉపవాసం పాటించాలి. అయితే ఎవరైనా ప్రయాణంలో వుంటే, వ్యాధిగ్రస్తులయితే వారు ఆ ఉపవాసాలను వేరే రోజులలో పూర్తిచేయాలి. " దేవుడు మీకు సౌలభ్యం కలుగజేయాలని భావిస్తూ వున్నాడు కానీ, మిమ్మలను ఇబ్బందులలో పడవేయాలని అనుకోవడం లేదు" అని ఖురాన్ పేర్కొంది.

Days For Fasting

[మార్చు]

Month of Ramadhan

[మార్చు]

Fasting in the month of Ramadan is considered Fard (obligitory)

Days For Voluntary Fasting

[మార్చు]

Islam also prescribed certain days for non-obligatory, voluntary fasting, such as:

  • each Monday and Thursday of a week
  • the 13th, 14th, and 15th day of each lunar month
  • six days in the month of Shawwal (the month following Ramadan)
  • the Day of Arafat (9th of Dhu al-Hijjah in the Islamic (Hijri) calendar)
  • the Day of Ashura (10th of Muharram in the Hijri calendar), with one more day of fasting before or after it (For Sunni Muslims only. It is Abominate in Shia Islam)
  • As often as possible in the months of Rajab and Shaban before Ramadhan
  • First ten days of Dhu al-Hijjah in the Islamic calendar

ఉపవాసాలు ఎప్పుడు నిషిద్ధము?

[మార్చు]

ఉపవాస దీక్షలు, అతిముఖ్య ధార్మిక కార్యమైననూ, క్రింద నుదహరింపబడిన దినములలో ఈ ఉపవాసాలు నిషిద్ధము:

  • ఈదుల్ అజ్‌హా రోజున (పండుగ రోజున)
  • ఈదుల్ ఫిత్ర్ (రంజాన్ పండుగ రోజున)
  • అయ్యామె తష్రీఖ్ (తష్రీఖ్ దినాలు) అనగా జుల్ హజ్జా మాసంలోని 11, 12, 13వ తారీకులు.

ఇతర మతములలో ఉపవాస దీక్షలు

[మార్చు]

క్రైస్తవ మతము, యూద మతము, హిందూ మతము, బౌద్ధ మతము, బహాయి విశ్వాసము లోనూ ఈ ఉపవాస దీక్షలు సర్వ సాధారణం. ఒక విధంగా చూస్తే, తూర్పు దేశాలలో, ధార్మికావలంబన కలిగిన జనసమూహాలలో ఈ ఉపవాస దీక్షలు, ధార్మిక కార్యంగా పరిణించి ఆచరించే సాంప్రదాయం.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సౌమ్&oldid=3858946" నుండి వెలికితీశారు








ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: https://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%8C%E0%B0%AE%E0%B1%8D

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy