1498
స్వరూపం
1498 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1495 1496 1497 - 1498 - 1499 1500 1501 |
దశాబ్దాలు: | 1470లు 1480లు - 1490లు - 1500లు 1510లు |
శతాబ్దాలు: | 14 వ శతాబ్దం - 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఫిబ్రవరి: పోర్చుగీసు అన్వేషకుడు వాస్కో డా గామా మాలింది (ఆధునిక కాలపు కెన్యా) చేరుకున్నాడు .
- మార్చి 2: వాస్కో డా గామా ఆగ్నేయ ఆఫ్రికాలోని క్వెలిమనే, మొజాంబిక్లను సందర్శించారు.
- మే
- జాన్ కాబోట్ బ్రిస్టల్‌ను యాత్రకు బయలుదేరాడు. మళ్ళీ కనబడలేడు.
- ఇంగ్లీష్ మర్చంట్ అడ్వెంచర్లకు నెదర్లాండ్స్‌తో వాణిజ్య గుత్తాధిపత్యం లభిస్తుంది.[1]
- మే 20: పోర్చుగీస్ నావిగేటర్ వాస్కో డా గామా భారతదేశంలోని కాలికట్ (ఆధునిక కోజికోడ్ ) చేరుకున్నాడు. ఆఫ్రికా చుట్టూ ప్రయాణించి అక్కడికి చేరుకున్న మొదటి యూరోపియన్ అయ్యాడు. తద్వారా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. తనకు అనువాదకుడిగా పనిచెయ్యగల అరబ్ వ్యాపారిని స్థానికంగా కనుగొన్నాడు
- మే 23: పోప్‌ను విమర్శించినందుకు ఫ్లోరెన్స్ పాలకుడు గిరోలామో సావోనరోలాను ఉరితీశారు.
- జూన్: రిపబ్లిక్ ఆఫ్ ఫ్లోరెన్స్ యొక్క రెండవ ఛాన్సలర్‌గా నికోలో మాకియవెల్లిని గ్రేట్ కౌన్సిల్ ఎన్నుకుంది.
- జూలై 31: పశ్చిమ అర్ధగోళానికి తన మూడవ సముద్రయానంలో, క్రిస్టోఫర్ కొలంబస్ ట్రినిడాడ్ ద్వీపాన్ని సందర్శించిన మొదటి యూరోపియన్ అయ్యాడు.
- ఆగస్టు 1: కొలంబస్ ఒరినోకో నది ముఖద్వారాన్ని కనుగొన్నాడు.
- ఆగస్టు 4 – 12: కొలంబస్కు గల్ఫ్ ఆఫ్ పారియా కనబడింది.
- శాంటా మారియా డెల్లే గ్రాజీ (మిలన్) యొక్క రిఫెక్టరీ గోడపై లియోనార్డో డా విన్సీ ది లాస్ట్ సప్పర్ చిత్రలేఖనాన్ని పూర్తి చేసాడు.
- పూర్ణానంద సదాశివేంద్ర సరస్వతి తరువాత వ్యాసాచల మహాదేవేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠాధిపతి అయ్యాడు
- శ్రీకృష్ణ దేవరాయలు తిరుమల దేవిని పెళ్ళి చేసుకున్నాడు.
జననాలు
[మార్చు]- ఇస్మాయిల్ ఆదిల్షా, బీజాపూరు (1510 నుండి 1534 వరకు) సుల్తాను. (మ.1534)
- రాజా భర్మల్, అంబర్ (ప్రస్తుత రాజస్థాను రాష్ట్రంలోని జైపూరు) రాజు. అతడికి బీహారీ మాలు, భగ్మలు బీహారు మాలు అనే పేర్లు కూడా ఉన్నాయి. తన కుమార్తె హర్కా భాయి (జోధాబాయి) ని అక్బరుకు ఇచ్చి పెళ్ళి చేసాడు. (మ.1574)
- మీరాబాయి, హిందూ ఆధ్యాత్మిక కవయిత్రి, గాయకురాలు, శ్రీకృష్ణుని భక్తురాలు. (మ. 1546 / 1547)
మరణాలు
[మార్చు]- పూర్ణానంద సదాశివేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠాధిపతి (జ. 1417)
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Palmer, Alan; Veronica (1992). The Chronology of British History. London: Century Ltd. pp. 135–138. ISBN 0-7126-5616-2.