Content-Length: 161563 | pFad | https://te.wikipedia.org/wiki/1808

1808 - వికీపీడియా Jump to content

1808

వికీపీడియా నుండి

1808 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1805 1806 1807 - 1808 - 1809 1810 1811
దశాబ్దాలు: 1780లు 1790లు - 1800లు - 1810లు 1820లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం


సంఘటనలు

[మార్చు]
  • జనవరి 1: అమెరికా బానిసల దిగుమతిని నిషేధించింది. క్యూబా 1865వ్ వరకూ ఈ నిషేధం విధించలేదు. అప్పటికి 5 లక్షలకు పైగా బానిసలను క్యూబాకు తెచ్చారు.[1]
  • జనవరి 1: సియెర్రా లియోన్ బ్రిటను వలసగా మారిపోయింది.
  • ఫిబ్రవరి 21: రష్యా సైన్యం ఫిన్లాండు లోకి ప్రవేశించడంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది.
  • మార్చి 7: పోర్చుగల్‌ను ప్రాన్సు ఆక్రమించడంతో పోర్చుగీసు యువరాజు, అతడి కుటుంబమూ పోర్చుగీసు రాజదర్బారును బ్రెజిల్ లోని రియో డి జనీరో నగరానికి తరలించారు. దాంతో యావత్తు పోర్చుగీసు సామ్రాజ్యానికి ఇది కేంద్రమైంది.
  • ఏప్రిల్: పశ్చిమ పసిఫిక్ మహా సముద్రంలో అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో ఆ సంవత్సరం అక్కడి సముద్రపు గాలి చుట్టుపక్కల గాలి ఉష్ణోగ్రత పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సముద్రపు గాలి ఉష్ణోగ్రతలు ఐదేళ్ళ పాటు తగ్గిపోయాయి. [2]
  • జూన్ 15: 'జోసెఫ్ బోనపార్టె' స్పెయిన్ కి రాజు అయ్యాడు.
  • జూన్ 30: హంఫ్రీ డేవీ ఒక కొత్త మూలకాన్ని కునుగొని దానికి బొరాసియం అని పేరు పెట్టాడు. దానికే తరువాత బోరాన్ అని పేరు పెట్టారు.[3] ఇదే సంవత్సరం కాల్షియం మూలకాన్ని కూడా కనుగొన్నాడు
  • సెప్టెంబరు 29: రష్యా ఫిన్లాండుల మధ్య సంధి కుదిరింది. కాని అక్టోబరు 19 న ఇది భగ్నమైంది.
  • అక్టోబరు 6: హంఫ్రీ డేవీ పొటాష్ నుండి పొటాషియమ్‌ను వేరు చేసాడు
  • డిసెంబరు 1: రష్యను జారు చక్రవర్తి మొదటి అలెగ్జాండరు, ఫిన్లాండు తన రాజ్యంలో భాగమని ప్రకటించాడు
  • తేదీ తెలియదు: దత్తమండలం నుండి బళ్ళారి, కడప జిల్లాలను ఏర్పరచారు.

జననాలు

[మార్చు]
ఆండ్రూ జాన్సన్

మరణాలు

[మార్చు]
  • తేదీ తెలియదు: హైదరాబాదు దివాను మీరాలం. ఇతడి పేరిటే మీరాలం చెరువును నిర్మించారు

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Joseph R. Conlin, The American Past: A Survey of American History (Cengage Learning, 2008)
  2. Chenoweth, M. (2001), Two major volcanic cooling episodes derived from global marine air temperature, AD 1807–1827, Geophys. Res. Lett., 28(15), 2963–2966, doi:10.1029/2000GL012648.
  3. Marco Fontani, Mariagrazia Costa and Mary Virginia Orna, The Lost Elements: The Periodic Table's Shadow Side (Oxford University Press, 2014)
"https://te.wikipedia.org/w/index.php?title=1808&oldid=3846065" నుండి వెలికితీశారు








ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: https://te.wikipedia.org/wiki/1808

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy