కె.ఎ.నీలకంఠ శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్లిడైకురిచ్చి అయ్య నీలకంఠ శాస్త్రి
జననం(1892-08-12)1892 ఆగస్టు 12
కల్లిడైకురిచ్చి, బ్రిటీష్ ఇండియా
మరణం1975 జూన్ 15(1975-06-15) (వయసు 82)
మద్రాసు, భారతదేశం
నివాసంనీలేశ్వర్
చదువుకున్న సంస్థలుమద్రాస్ క్రిస్టియన్ కాలేజి
ప్రభావితం చేసినవారుఎస్.కృష్ణస్వామి అయ్యంగార్
ముఖ్యమైన పురస్కారాలుపద్మభూషణ్ (1957)

కల్లిడైకురిచ్చి అయ్య నీలకంఠ శాస్త్రి (12 ఆగష్టు 1892 – 15 జూన్ 1975) దక్షిణ భారతదేశపు చరిత్రను వ్రాసిన ప్రముఖ భారతీయ చరిత్రకారుడు. ఇతని అనేక గ్రంథాలు చరిత్రకు సంబంధించిన ప్రామాణికమైన ఆధార గ్రంథాలుగా రూపుదిద్దుకున్నాయి. ఇతని పాండిత్యానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారత మూడవ అత్యున్నత పురస్కారం, పద్మభూషణ్ ప్రదానం చేసింది.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి సమీపంలోని కల్లిడైకురిచ్చి అనే గ్రామంలో 1892, ఆగష్టు 12న ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[2] ఇతడు తిరునల్వేలిలోని ఎం.డి.టి. హిందూ కాలేజీలో ఎఫ్.ఎ. చదివాడు. కళాశాల విద్య మద్రాస్ క్రిస్టియన్ కాలేజిలో పూర్తి చేశాడు.[3][4] ఇతడు మద్రాసు ప్రెసిడెన్సీలో ఎం.ఎ. ప్రథముడిగా ఉత్తీర్ణుడైనాడు. మద్రాసులోని హిందూ కాలేజీలో 1913 నుండి 1918 వరకు ఉపన్యాసకుడిగా పనిచేశాడు.[5][6]ఇతడు చరిత్ర ఆచార్యుడిగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 1918-1920ల మధ్య పనిచేశాడు.[5] అటుపిమ్మట అన్నామలై విశ్వవిద్యాలయంలో కొత్తగా ఏర్పాటయిన ఆర్ట్స్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా నియమితుడైనాడు.[7]

1929లో ఇతడు తిరుచ్చి హిందూ కళాశాలలో చరిత్ర ఆచార్యుడిగా చేరాడు. అదే సంవత్సరం మద్రాసు విశ్వవిద్యాలయంలో చరిత్ర, పురావస్తు శాఖలో ఆచార్యునిగా ఎస్.కృష్ణస్వామి అయ్యంగార్.[8] స్థానంలో నియమించబడి[9] 1946 వరకు కొనసాగాడు.[3]1952-1966 మధ్యలో ఇతడు మైసూర్ విశ్వవిద్యాలయలో ఇండాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నాడు.[3][5][9] 1954లో మైసూర్ రాజ్యంలోని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంటుకు డైరెక్టర్‌గా ఉన్నాడు. 1950లలో ఇతడు అఖిల భారత ప్రాచ్య సమ్మేళనానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు.[10]ఇతడు 1957-1972ల మధ్య "యునెస్కో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ కల్చర్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా"కు డైరెక్టర్‌గా సేవలందించాడు".[3][9] 1957లో ఇతని సేవలకు గుర్తింపుగా భారతప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందించింది. 1959లో ఇతడు యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా దక్షిణ భారత చరిత్ర బోధించాడు.[5] ఇతడు 1975 జూన్ 15న మరణించాడు.[9]

పరిశోధకునిగా

[మార్చు]

శాస్త్రి ప్రముఖ భారతీయ చారిత్రిక, ప్రాచ్య, సాంస్కృతిక సంస్థలైన ఇండియన్ హిష్టరీ కాంగ్రెస్, ఇండియన్ హిష్టారికల్ రికార్డ్స్ కమిషన్, ఆలిండియా ఓరియంటల్ కాన్ఫరెన్సులతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవాడు. ఆయన అందులో ప్రచురించిన పరిశోధకా వ్యాసాలు గణనీయమైనవి. 1946లో పాట్నాలో జరిగిన హిష్టరీ కాంగ్రెస్ కు ఆయన అధ్యక్షత వహించాడు. శాస్త్రి భారతాన్ని పాలించిన రాజవంశాలపైన, ఆగ్నేసియాదేశాల మత సంస్కృతులపై దక్షిణభారతదేశ ప్రభావము అను విషయంపై చాలా పరిశోధన చేసాడు.

ది చోళాస్అను శీర్షికతో రెండు సంపుటాలు, స్టడీస్ ఇన్ ద చోళా హిస్టరీ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనేది శాస్త్రిగారి తొలి చారిత్రిక పరిశోధనా ఫలాలు. అటుపై ది పాండ్యన్ కింగ్డమ్ అను పరిశోధనా గ్రంథం చారిత్రికుడిగా ఆయన కీర్తిని ఇనుమడింపజేసింది. ఆయన గ్రంథాలలో ఇది ప్రఖ్యాతి గాంచినది. అటుపై ఎ హిష్టరీ ఆఫ్ సౌత్ ఇండియా చారిత్రికులకు, సామాన్యులకు అర్ధమయ్యేరీతిలో రచింపబడిన గ్రంధమిది. అత్యంత ప్రాచీన కాలము నుండి విజయనగర రాజులు, బహమనీ సుల్తానుల చరిత్ర వరకు దక్షిణ భారత రాజవంశాల చరిత్ర-సంస్కృతి సంక్షిప్తంగా ఇందు వివరింపబడింది. దక్షిణ భారత చరిత్రకి ఇది ఒక ప్రమాణగ్రంధము.

శాస్త్రి రచించిన ప్రధాన గ్రంధాలలో ఫర్దర్ సోర్సెస్ ఆఫ్ విజయనగర హిష్టరీ ఒకటి.ఇది డాక్టర్ నేలటూరి వేంకటరమణయ్యతో కలసి రచించాడు.దూర ప్రాచ్యదేశాల మత, సంస్కృతులపై దక్షిణ భారతముయొక్క ప్రభావము అను విషయంపై విస్తారమైన పరిశోధన గావించిన ప్రముఖులలో శాస్త్రి గణనీయులు. సౌత్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఫార్ ఈస్ట్ హిష్టరీ అఫ్ శ్రీవిజయ అనే గ్రంధాలు శాస్త్రి ఈ విషయంపై జరిపిన పరిశోధనా ఫలితాలు.

గుర్తింపు

[మార్చు]

నీలకంఠశాస్త్రి దక్షిణ భారతదేశపు చరిత్రకారులలో అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు.[9] తమిళ చరిత్రకారుడు ఎ.ఆర్.వెంకటాచలపతి ఇతడిని "తమిళనాడుకు చెందిన 21వ శతాబ్దపు అత్యుత్తమ చారిత్రకుడి"గా ప్రస్తుతించాడు.[11] ఇతడి గ్రంథం ఎ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా అనేక విశ్వవిద్యాలయాలలో భారతీయ చరిత్ర విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా ఎంపిక చేశాడు.

రచనలు

[మార్చు]

ఇతడు ఆంగ్లంలో 25 చారిత్రక గ్రంథాలను రచించాడు. వాటిలో ఎక్కువ భాగం దక్షిణ భారత చరిత్రకు సంబంధించనవే.[9]

  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1929). The Pāṇḍyan Kingdom from the Earliest Times to the Sixteenth Century. Luzac.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1932). Studies in Chola history and administration. University of Madras.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1935). The Cholas. University of Madras.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1936). A comprehensive history of India. Orient Longman.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1941). Historical method in relation to problems of South Indian history. University of Madras.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1945). Gleanings on social life from the Avadanas. Indian Research Institute.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1946). Further sources of Vijayanagara history. University of Madras.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1948). The Tamil kingdoms of South India. The National Information & Publications.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1949). South Indian Influences in the Far East. Hind Kitabs.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1949). History of Sri Vijaya. University of Madras.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1955). A History of South India: From Prehistoric Times to the Fall of Vijayanagar. Oxford University Press.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ; H.S Ramanna (1956). Historical method in relation to Indian history.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1957). A Comprehensive History of India. Orient Longman.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1963). Development of religion in South India. Orient Longman.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1964). The Culture and History of the Tamils. K. L. Mukhopadhyay.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1964). Sources of Indian history with special reference to South India. Asian Publishing House.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1965). A great liberal: speeches and writings of Sir P. S. Sivaswami Aiyar. Allied Publishers.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ; G. Srinivasachari (1966). Life and culture of the Indian people: a historical survey. Allied Publishers.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1967). Cultural Contacts Between Aryans and Dravidians. Manaktalas.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1967). Age of the Nandas and Mauryas. Motilal Banarsidass.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ; G. Srinivasachari (1971). An Advanced history of India. Allied Publishers.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1972). Foreign Notices of South India: From Megasthenes to Ma Huan. University of Madras.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1972). Sangam literature: its cults and cultures. Swathi Publishers.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1974). Aspects of India's history and culture. Oriental Publishers.
  • శాస్త్రి, కె.ఎ.నీలకంఠ (1978). South India and South-East Asia: studies in their history and culture. Geetha Book House (Mysore).

మూలాలు

[మార్చు]
  1. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived (PDF) from the original on 15 నవంబరు 2014. Retrieved July 21, 2015. {{cite web}}: Unknown parameter |DUPLICATE_url-status= ignored (help)
  2. The Modern Review. Prabasi Press Private, Ltd. 1975. p. 22.
  3. 3.0 3.1 3.2 3.3 Rahman, M. M. (2006). Encyclopaedia of Historiography. Anmol Publications PVT LTD. p. 346. ISBN 81-261-2305-2. ISBN 978-81-261-2305-6.
  4. "Famous Alumni". Alumni Association of Delhi and North India,Madras Christian College. Archived from the original on 18 ఆగస్టు 2009. Retrieved 6 November 2009.
  5. 5.0 5.1 5.2 5.3 K.A. Nilakanta, Sastri. (1971). Professor K. A. Nilakanta Sastri felicitation volume: in commemoration of his 80th birthday. Prof. K. A. Nilakanta Sastri Felicitation Committee. pp. About Section.
  6. Journal of Indian history, Volume 53. Dept. of Modern Indian History. 1975. p. 350.
  7. Muthiah, S. (19 April 2004). "High school to university". The Hindu: Metro Plus. Archived from the original on 8 ఆగస్టు 2007. Retrieved 12 November 2008.
  8. "History". Department of History, University of Madras. Archived from the original on 22 ఏప్రిల్ 2008. Retrieved 22 సెప్టెంబరు 2017.
  9. 9.0 9.1 9.2 9.3 9.4 9.5 Sreedharan, E. (2004). A Textbook of Historiography, 500 B.C. to A.D. 2000: 500 BC to AD 2000. Orient Longman. p. 462. ISBN 81-250-2657-6. ISBN 978-81-250-2657-0.
  10. Prasad, Rajendra (1984). Dr. Rajendra Prasad, correspondence and select documents, Volume 6. Allied Publishers. p. 168. ISBN 81-7023-002-0. ISBN 978-81-7023-002-1.
  11. Vēṅkaṭācalapati, Ā. Irā (2006). In Those Days There was No Coffee: Writings in Cultural History. Yoda Press. p. 2. ISBN 81-902272-7-0. ISBN 978-81-902272-7-8.

మరింత సమాచారానికై

[మార్చు]