1590 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1587 1588 1589 - 1590 - 1591 1592 1593
దశాబ్దాలు: 1570లు 1580లు - 1590లు - 1600లు 1610లు
శతాబ్దాలు: 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 27 వ శతాబ్దం


సంఘటనలు

మార్చు
 
మక్కామసీదు - చార్మినారు నుండి దృశ్యం
  • మే – ఆగస్టు: ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ IV పారిస్‌ను ముట్టడించడంలో విఫలమయ్యాడు. అలెగ్జాండర్ ఫర్నేస్, డ్యూక్ ఆఫ్ పర్మా తన స్పానిష్ సైన్యంతో రక్షణగా రావడంతో హెన్రీ ముట్టడిని ఎత్తెయ్యాల్సి వచ్చింది.
  • మే 17: ఎడిన్‌బర్గ్‌లోని హోలీరూడ్ అబ్బే వద్ద డెన్మార్క్‌కు చెందిన అన్నేకు స్కాట్లాండ్ పట్టపు రాణిగా పట్టాభిషేకం చేశారు. [1]
  • మే 21: కాన్స్టాంటినోపుల్ ఒప్పందం కుదిరింది.
  • ఆగష్టు 18: రోనోకే వలస స్థావరం గవర్నరైన జాన్ వైట్, ఇంగ్లాండ్కు సరఫరాల కోసం ఇంగ్లాండు వెళ్ళి తిరిగి వచ్చేసరికి అతడి స్థావరం నిర్జనమైందని కనుగొన్నాడు. అన్వేషణ విఫలమవడంతో, అతడు అక్టోబర్ 24 న ఇంగ్లాండ్కు తిరిగి వస్తాడు.
  • సెప్టెంబర్ 5: అలెగ్జాండర్ ఫర్నేస్ సైన్యం బలంగా ఎదుర్కోవడంతో ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ IV పారిస్ ముట్టడిని ఎత్తివేసాడు.
  • సెప్టెంబర్ 15: సిక్స్టస్ V తరువాత అర్బన్ VII 228 వ పోప్ అయ్యాడు. అతను పన్నెండు రోజుల తరువాత మలేరియాతో మరణించాడు.
  • సెప్టెంబర్ 15: దిగువ ఆస్ట్రియా, వియన్నాలో న్యూలెంగ్‌బాచ్ భూకంపం గణనీయమైన నష్టాన్ని, కొంత ప్రాణనష్టాన్నీ కలిగించింది. బోహేమియా, సిలేసియా వరకు ఈ భూకంప ప్రభావం కనిపించింది.
  • డిసెంబర్ 5: అర్బన్ VII తరువాత గ్రెగొరీ XIV 229 వ పోప్ అయ్యాడు.
  • టయోటోమి హిడెయోషి జపాన్‌ను సమైక్య పరచాడు
  • డచ్చి దళాలు స్పానిష్ వారిని దక్షిణ గెల్డర్‌ల్యాండ్ నుండి బయటకు నెట్టివేస్తాయి.
  • ఓట్టోమన్ సుల్తాను పర్షియాతో చేస్తున్న యుద్ధంలో అవసరమైన ఇనుము, స్టీల్, ఇత్తడి, టిన్ లను సరఫరా చేసే ఒప్పందంపై .కొందరు ఆంగ్ల వ్యాపారులకు తన సామ్రాజ్యంలో వ్యాపారం చేసుకునేందుకు అనుమతించాడు.  

జననాలు

మార్చు

మరణాలు

మార్చు

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Anne of Denmark: Biography". Retrieved 7 May 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=1590&oldid=3845601" నుండి వెలికితీశారు
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy