జనవరి 20
తేదీ
జనవరి 20, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 20వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 345 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 346 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2025 |
సంఘటనలు
మార్చు- 1957: భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సరను ట్రాంబేలో ప్రారంభించారు.
- 1993: అమెరికా 42వ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
- 2009: అమెరికా 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పదవీ బాధ్యతలు చేపట్టారు.
- 2010: నైజీరియాలో మతఘర్షణలు చెలరేగి 200 మంది మృతిచెందారు.
- 2011: భారత దేశము : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మొబైల్ నంబర్ పొర్టబులిటీ (Mobile Number Portability) సర్వీసుని ప్రారంభించారు.
జననాలు
మార్చు- 1907: బందా కనకలింగేశ్వరరావు, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (మ.1968)
- 1920: బి.విఠలాచార్య,'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 70 చిత్రాలను రూపొందించారు. (మ.1999)
- 1940: కృష్ణంరాజు, తెలుగు నటుడు, రాజకీయవేత్త.
- 1960: విజయ నరేష్, తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు.
మరణాలు
మార్చు- 1900: పరవస్తు వెంకట రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1822)
- 1988: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీగా పిలువబడిన స్వాతంత్ర్య సమర యోధుడు. (జ.1890)
- 2008: సయ్యద్ హుసేన్ బాషా, నాటక,చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత.(జ.1939)
- 2016: తిరుమాని సత్యలింగ నాయకర్, మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (జ.1935)
- 2016: సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (జ.1932)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- -
బయటి లింకులు
మార్చుజనవరి 19 - జనవరి 21 - డిసెంబర్ 20 - ఫిబ్రవరి 20 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |