Jump to content

చర్మము

వికీపీడియా నుండి
చర్మంలోని పొరలు: బహిశ్చర్మం, అంతశ్చర్మం, ఆధారకణజాలము, రోమాలు, స్వేద గ్రంధులు.

చర్మము (Skin) మన శరీరంలో అతిపెద్ద అవయవము. దీనిలో మూడు ముఖ్యమైన పొరలుంటాయి. చర్మము శరీరమంతా కప్పి లోపలి భాగాల్ని రక్షిస్తుంది. నవరంధ్రాలవద్ద చర్మం లోపిస్తుంది. ఇది వివిధ రంగులలో ఉంటుంది. చర్మానికి సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని 'డెర్మటాలజీ' అంటారు.

నిర్మాణం

[మార్చు]

చర్మంలో ముఖ్యంగా బాహ్యచర్మం, అంతశ్చర్మం అనే రెండు పొరలుంటాయి. బాహ్యచర్మం బహిస్త్వచం నుంచి ఏర్పడుతుంది. రోమాలు, స్వేద గ్రంధులు బాహ్యచర్మానికి చెందినవి. గోళ్ళు కూడా దీనినుంచే ఏర్పడతాయి.

చర్మం పొరలు

[మార్చు]

బాహ్యచర్మం

[మార్చు]

బాహ్యచర్మం మీ చర్మం యొక్క బయటి పొర, ఇది హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు ఇతర విదేశీ పదార్ధాలను లోతైన పొరలలోకి ప్రవేశించకుండా నిరోధించే రక్షణ అవరోధంగా మారుతుంది. ఇది చర్మం నుండి నీటి నష్టాన్ని నివారిస్తుంది మెలనోసైట్స్ ఉండటం వల్ల దాని రంగుకు కూడా కారణం.

అంతఃచర్మం

[మార్చు]

బాహ్యచర్మం క్రింద రెండవ పొర చర్మము, దీనిలో కొల్లాజెన్, ఎలాస్టిన్, రక్త నాళాలు వెంట్రుకలు ఉంటాయి. ఈ పొరలో ఉన్న చెమట గ్రంథులు చెమటను ఉత్పత్తి చేస్తాయి, ఇది శరీరం నుండి విషాన్ని బయటకు తీయడానికి సహాయపడుతుంది, దానిని చల్లగా ఉంచుతుంది. చర్మ పొరలోని నరాల చివరలు మీ శరీరంలో స్పర్శ భావనకు కారణమవుతాయి.

బాహ్యచర్మము అడుగున ఉన్న కణజాలము

[మార్చు]

సబ్కటానియస్ కణజాలం లేదా హైపోడెర్మిస్ బాగా వాస్కులరైజ్డ్, వదులుగా ఉండే బంధన కణజాలం కొవ్వు కణజాలాలను కలిగి ఉంటుంది. కండరాలు, స్నాయువు, స్నాయువు, ఉమ్మడి గుళిక ఎముకలతో సహా లోతైన కణజాలాలు హైపోడెర్మిస్ క్రింద ఉంటాయి.

ఈ పొర ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది పరిపుష్టి లేదా షాక్ శోషక వలె పనిచేస్తుంది. ఈ పొరలో ఉన్న కొవ్వు మీ కండరాలు, ఎముకలు అంతర్గత అవయవాలను గాయాల నుండి రక్షిస్తుంది. ఎముకలు కండరాలకు చర్మాన్ని అటాచ్ చేయడానికి కూడా పొర సహాయపడుతుంది.[1]

ధర్మాలు

[మార్చు]
  • పరిసరాల వాతావరణమునుండి, సూక్ష్మక్రిములనుండి శరీరభాగాల్ని రక్షించడం.
  • స్పర్శ జ్ఞానాన్ని (Touch sensation) కలుగజేయడం.
  • నీరు చర్మంద్వారా చెమట రూపంలో పోతుంది. చర్మంలోని రక్తనాళాల సంకోచ వ్యాకోచాల ద్వారా నీటినష్టాన్ని నిరోధిస్తుంది.
  • శరీర ఉష్ణోగ్రతను వివిధకాలాల్లో స్థిరంగా ఉంచడం.
  • కొన్ని విటమిన్లు తయారుకావడానికి చర్మం ఉపయోగపడుతుంది.

చర్మం రకాలు

[మార్చు]
  • సాధారణ చర్మం
  • జిడ్డుగల చర్మం
  • పొడి బారిన చర్మం
  • సున్నితమైన చర్మం

వ్యాధులు

[మార్చు]

చర్మ వ్యాదులకు గల కారణాలు

[మార్చు]
  • అపరిమితమైన వాయుకాలుష్యం వాళ్ళ చర్మం ముడుతలు పడుతుంది.
  • కాలుష్య ప్రభావం వల్ల ఒంటి నిండా మచ్చలు ఏ ర్పడుతాయి.
  • బట్ట థలగూడ వస్తుంది.
  • ఏ సి లలో పనిచేసేవారు, ఎండలలో తిరగాలంటే రెండురకాల వాతావరణానికి హార్మోన్స్ తట్టుకోలేకపోతాయి.
  • నిద్ర సరీగా లేకపోవడం వల్ల, కాలుష్యం వల్ల చాలామంది యువతీ, యువకుల మొహాలు కళావిహీనంగా మారుతున్నాయే. బట్ట తలగూడ వస్తుంది.[2]

చర్మ సంరక్షణ జాగ్రత్తలు

[మార్చు]
  • ఒక శీతాకాలం మాత్రమే కాకుండా ఎ కాలంలో అయినా మన చర్మ సంరక్షణ చూసుకోవాలి. శీతాకాలంలో ముఖానికి మాయిశ్చరైజర్ వాడాలి.. డ్రై స్కిన్ వారు చాలా జాగ్రత్తగా మెలగాలి. ఈ కాలంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. అందుకని చర్మం కూడా ఈ శీతాకాలంలో పొడిబారిపోతుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి అంత ప్రమాదం లేదు కాని పొడి చర్మం ఉన్నవారు జాగ్రత్త తీసుకోవాలి.
  • కొన్ని చిట్కాలు పాటించడం వల్ల శీతాకాలంలో చర్మ సంరక్షణ ఎలా కాపాడుకోవాలో చూద్దాం. స్నానం చేయడం, రాత్రిపూట చలి నుంచి చర్మాన్ని ముఖ్యంగా పెదవులను, పాదాలను కాపాడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం చేయాలి. విటమిన్స్, మినరల్స్ ఉన్న ఆహారం తినాలి. వింటర్ స్కిన్ కేర్ లాంటివి వాడాలి.
  • కొబ్బరి నూనెలో రోజ్‌మేరీ, లావెండర్ సుగంధ తైలాలను కలిపి మసాజ్ చేసినట్టయితే శరీరం నునుపుగా తయారవుతుంది. మసాజ్ వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
  • పాదాలు పగిలినట్లయితే పారాఫిన్ వాక్స్‌ను కరిగించి, అందులో కొద్దిగా ఆవాల నూనెను కలిపి పగుళ్లు ఉన్న చోట రాస్తే పాదాలు మృదువుగా అవుతాయి. ఈ మిశ్రమం అందుబాటులో లేకుంటే గ్లిజరిన్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి కాలి పగుళ్లకు రాస్తే నునుపుగా అవుతాయి.
  • చేతులు, పాదాలపై ఉండే గరుకుదనం, నలుపు, జిడ్డు మురికి పోవాలంటే నిమ్మ చెక్కతో రుద్దాలి. రోజుకు ఒకసారైనా సబ్బుతో ముఖం కడగాలి. కడిగిన తర్వాత ఐస్‌క్యూబ్‌తో ముఖమంతా మసాజ్ చేసినట్లు రుద్దాలి. రోజుకు కనీసం మూడు సార్లు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి.[3]
  • ఇవి మాత్రమే కాకుండా, కొన్ని రకాల సౌందర్య సాధనాలు వాడి కూడా మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచవచ్చు. ఫేస్ వాష్, బాడీ స్క్రబ్, బాడీ లోషన్, ఫేస్ మాస్క్, స్కిన్ సీరాలు వాడి మొటిమలు, డార్క్ స్పాట్స్, డ్రై స్కిన్, జిడ్డు, స్కిన్ ట్యాన్‌, దద్దుర్లు, ముడతలు వంటి వాటిని తగ్గించవచ్చు నివారించవచ్చు. వావ్, రూప్ మంత్ర, మామఎర్త్,[4] ఓరియంటల్ బొటనిక్స్ లాంటి కంపెనీలు ఎన్నో ఇటువంటి సౌందర్య సాధనాలు విరివిగా ఉత్పత్తి చేస్తున్నాయి.
  • మచ్చలేని, ఆరోగ్యకరమైన, మెరిసే, పోషణతో కూడిన చర్మం కోసం ForMen విటమిన్ సి బ్రైటెనింగ్ సీరంని కూడా ప్రయత్నించవచ్చు.

జంతువుల చర్మం (తోలు)

[మార్చు]
  • కొన్ని జంతువుల చర్మంతో బట్టలు, సంచులు మొదలగునవి తయారుచేస్తారు. వీటికోసం జంతువులను చంపడం చట్టారీత్యా నేరమైనా కోట్లల్లో వ్యాపారం దీనివల్ల జరుగుతుంది.

వర్ణభేదం

[మార్చు]

ఆఫ్రికా దేశీయులు నల్లగా ఉంటారు. ఉత్తర ఐరోపా దేశీయులు తెల్లగా ఉంటారు. ఆసియా మరికొన్ని ప్రాంతాల ప్రజలు వీరిరువురి మధ్యలో ఉంటారు. ఈ వర్ణభేదాలకు కారణం చర్మంలోని 'మెలనిన్' అనే రంగుపదార్ధం.తక్కువ మెలనిన్ను ఆల్బన్స్ అంటారు.

మూలాలు

[మార్చు]
  1. "Understanding The Different Layers Of Skin". SkinKraft (in ఇంగ్లీష్). Retrieved 2023-05-11.
  2. https://te.vikaspedia.in/health/diseases/c1ac30c4dc2e-c38c02c30c15c4dc37c23-c1cc3ec17c4dc30c24c4dc24c32c41
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-12. Retrieved 2020-06-12.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-11-01. Retrieved 2020-10-30.

"చర్మ సంరక్షణ చిట్కాలు".

"https://te.wikipedia.org/w/index.php?title=చర్మము&oldid=4100032" నుండి వెలికితీశారు
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy