పాట్నా జిల్లా
పాట్నా జిల్లా | |
---|---|
దేశం | దేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | పాట్నా |
ముఖ్యపట్టణం | పాట్నా |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,202 కి.మీ2 (1,236 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 58,38,465 |
• జనసాంద్రత | 1,800/కి.మీ2 (4,700/చ. మై.) |
• Urban | 25,14,590 (43.7%) (2,011) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 73.68%[1] |
Time zone | UTC+05:30 (IST) |
Website | http://patna.bih.nic.in |
బీహార్ రాష్ట్రంలోని జిల్లాల్లో పాట్నా జిల్లా ఒకటి. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా, జిల్లాకు కూడా ముఖ్యపట్టణం. పాట్నా జిల్లా పాట్నా విభాగంలో భాగం.
2011 నాటికి, ఇది బీహార్లో అత్యధిక జనాభా కలిగిన జిల్లా. [2] భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాల్లో పదిహేనవ స్థానంలో ఉంది. [3] [4]
భౌగోళికం
[మార్చు]ఈ జిల్లాకు పశ్చిమాన సోన్ నది, ఉత్తరాన గంగా నది సహజమైన సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణాన నలందా, అర్వాల్, జహానాబాద్ జిల్లాలు ఉన్నాయి. తూర్పున బేగుసరాయ్ జిల్లా, ఆగ్నేయంలో లఖిసరాయ్ ఉంది.
పాట్నా జిల్లా విస్తీర్ణం 3,202 చ.కి.మీ. [5] ఇది సాలమన్ దీవుల్లోని మకిరా దీవి వైశాల్యానికి సమానం. [6]
శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]జిల్లాలో పద్నాలుగు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి: [7] [8] [9] [10]
- 178 మోకామా
- 179 బార్
- 180 బఖ్తియార్పూర్
- 181 దిఘ
- 182 బంకీపూర్
- 183 కుమ్రార్
- 184 పాట్నా సాహిబ్
- 185 ఫతుహా
- 186 దానపూర్
- 187 మానేర్
- 188 ఫుల్వారీ (ఎస్సీ)
- 189 మసౌరి (ఎస్సీ)
- 190 పాలిగంజ్
- 191 బిక్రామ్
పార్లమెంటరీ నియోజకవర్గాలు
[మార్చు]జిల్లాలో మూడు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి :
- పాట్నా సాహిబ్ (లోక్‌సభ నియోజకవర్గం), బక్తియార్‌పూర్, దిఘా, బంకీపూర్, కుమ్రార్, పాట్నా సాహిబ్, ఫతుహాలను కవర్ చేస్తుంది.
- [31] పటాలిపుత్ర (లోక్‌సభ నియోజకవర్గం), దానపూర్, మానేర్, ఫుల్వారీ, మసౌరి, పాలిగంజ్, బిక్రామ్ శాసనసభ నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి.
- ముంగెర్ / మొంగైర్ (లోక్సభ నియోజకవర్గం), బార్, మోకామా శాసనసభ నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి.ఇందులో ముంగేర్ జిల్లా కూడా చేరుతుంది.
జనాభా
[మార్చు]చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1901 | 10,28,073 | — |
1911 | 10,18,226 | −1.0% |
1921 | 9,98,101 | −2.0% |
1931 | 11,68,744 | +17.1% |
1941 | 13,57,416 | +16.1% |
1951 | 16,00,295 | +17.9% |
1961 | 18,61,811 | +16.3% |
1971 | 22,50,883 | +20.9% |
1981 | 30,19,201 | +34.1% |
1991 | 36,18,211 | +19.8% |
2001 | 47,18,592 | +30.4% |
2011 | 58,38,465 | +23.7% |
2011 జనగణన ప్రకారం పాట్నా జిల్లా జనాభా 58,38,465. [2] ఇది నికరాగువా దేశానికి [11] లేదా అమెరికా లోని మేరీల్యాండ్ రాష్ట్ర జనాభాకు సమానం. [12] ఇది భారతదేశపు జిల్లాల్లో 15 వ స్థానం. జిల్లాలో జనసాంద్రత 1,823/చ.కి.మీ . 2001–2011 దశాబ్దంలో జిల్లా జనాభా వృద్ధి రేటు 22.34%. జిల్లాలో లింగ నిష్పత్తి 897 / 1,000, అక్షరాస్యత 72,47%.
2011 జనగణన ప్రకారం, జిల్లాలో 46.35% మంది మాగధి, 43.77% హిందీ, 5.19% ఉర్దూ, 2.67% భోజ్‌పురి, 1.24% మైథిలి లను తమ మొదటి భాషగా మాట్లాడతారు. [13]
వాతావరణం
[మార్చు]శీతోష్ణస్థితి డేటా - Patna | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 23.3 (73.9) |
26.5 (79.7) |
32.6 (90.7) |
37.7 (99.9) |
38.9 (102.0) |
36.7 (98.1) |
33.0 (91.4) |
32.4 (90.3) |
32.3 (90.1) |
31.5 (88.7) |
28.8 (83.8) |
24.7 (76.5) |
31.53 (88.75) |
సగటు అల్ప °C (°F) | 9.2 (48.6) |
11.6 (52.9) |
16.4 (61.5) |
22.3 (72.1) |
25.2 (77.4) |
26.7 (80.1) |
26.2 (79.2) |
26.1 (79.0) |
25.7 (78.3) |
21.8 (71.2) |
14.7 (58.5) |
9.9 (49.8) |
19.65 (67.37) |
సగటు అవపాతం mm (inches) | 19 (0.7) |
11 (0.4) |
11 (0.4) |
8 (0.3) |
33 (1.3) |
134 (5.3) |
306 (12.0) |
274 (10.8) |
227 (8.9) |
94 (3.7) |
9 (0.4) |
4 (0.2) |
1,130 (44.5) |
Source: worldweather.org[14] |
మూలాలు
[మార్చు]- ↑ "District-specific Literates and Literacy Rates, 2001". Registrar General, India, Ministry of Home Affairs. Archived from the original on 14 April 2010. Retrieved 5 October 2010.
- ↑ 2.0 2.1 "District Census 2011". Census2011.co.in. 2011. Archived from the original on 11 June 2011. Retrieved 30 September 2011.
- ↑ "Patna Pin Code list, Population density ,literacy rate and total Area with census 2011 details". www.indiamapia.com. Archived from the original on 2017-10-17. Retrieved 2017-12-28.
- ↑ "District wise population in India as of 2011 census". updateOX. 2011-05-24. Archived from the original on 2017-12-29. Retrieved 2017-12-28.
- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7.
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Archived from the original on 1 December 2015. Retrieved 11 October 2011.
Makira 3,190km2
- ↑ "14 segments in Patna dist this time". Archived from the original on 2017-12-29.
- ↑ "General Election 2009 Assembly constituencies". Pataliputra. India elections.co.in. Archived from the original on 2009-04-24. Retrieved 2017-12-28.
- ↑ "Monghyr (Munger) loksabha constituency seat election results". IndiaStudyChannel.com. Archived from the original on 2017-12-29. Retrieved 2017-12-28.
- ↑ "Patna Sahib loksabha constituency seat election results". IndiaStudyChannel.com. Archived from the original on 2017-12-29. Retrieved 2017-12-28.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 September 2011. Retrieved 1 October 2011.
Nicaragua 5,666,301 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 19 October 2013. Retrieved 30 September 2011.
Maryland 5,773,552
- ↑ 2011 Census of India, Population By Mother Tongue
- ↑ "Climatological Information for Patna". World Weather. Archived from the original on 8 August 2013. Retrieved 25 February 2011.