మల్లు స్వరాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లు స్వరాజ్యం
మల్లు స్వరాజ్యం


శాసనసభ్యురాలు
పదవీ కాలం
1978 - 1985
ముందు గురుగంటి వెంకట నరసయ్య
తరువాత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
నియోజకవర్గం తుంగతుర్తి

వ్యక్తిగత వివరాలు

జననం 1931 (age 92–93)
కొత్తగూడెం గ్రామం, తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ
మరణం 19 మార్చి 2022
హైదరాబాద్
రాజకీయ పార్టీ సి.పి.ఐ (ఎం)
తల్లిదండ్రులు భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ
జీవిత భాగస్వామి మల్లు వెంకట నరసింహారెడ్డి
సంతానం గౌతమ్, నాగార్జున, కరుణ
నివాసం నల్గొండ, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

మల్లు స్వరాజ్యం (1931 – 2022 మార్చి 19[1])[2] తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. మల్లు వెంకట నరసింహారెడ్డి సతీమణి. మల్లు స్వరాజ్యం ఆత్మకథ "నా మాటే తుపాకీ తూటా" అన్న పేరుతో 2019లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా పుస్తకంగా వచ్చింది.

నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేయటం, గడీలపై దాడులు చేసి ధాన్యాన్ని పేదలకు పంచడం వంటి ఆమె ధైర్య సాహసాలను నిజాం సైన్యాలు ఎదుర్కొలేక ఆమె ఇంటిని తగలపెట్టాయి, ఆమెను పట్టిస్తే పది వేల రూపాయల నజరానా కూడా నిజాం ప్రభుత్వం ప్రకటించింది.[3]

జీవిత విశేషాలు

[మార్చు]

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో 1931లో జన్మించిన మల్లు స్వరాజ్యం నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి, రజాకార్ల పాలిటి సింహస్వప్నమై నిలిచింది. 1945-48 సంవత్సరాల్లో సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించి నైజాం సర్కారును గడగడలాడించింది. ఈమె పోరాటాల ధాటికి తట్టుకోలేక 1947-48లో ఈమె ఇంటిని పూర్తిగా దగ్ధం చేశారు. మల్లు స్వరాజ్యం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులను మేల్కొల్పింది.

ఈమె జానపద బాణీల్లో పాటలు కట్టి స్వయంగా పాడి గ్రామాలలోని ప్రజలను ఆకట్టుకునేది. ఈమె ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి 1978-1983[4], 1983-1984[5] సంవత్సరాలలో రెండు పర్యాయాలు సి.పి.ఐ.(ఎం)పార్టీ తరఫున ఎన్నికైంది. నల్లగొండకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణా యోధుడు, పార్లమెంటేరియన్ భీమిరెడ్డి నరసింహారెడ్డి ఈమెకు సోదరుడు. వామపక్ష భావాలతో, స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక 'చైతన్య మానవి' సంపాదకవర్గంలో ఈమె ఒకరు.

కుటుంబం

[మార్చు]

స్వరాజ్యం 1954లో మల్లు వెంకట నరసింహారెడ్డిని వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు సంతానం ఇద్దరు కుమారులు గౌతమ్, నాగార్జున, కుమార్తె కరుణ ఉన్నారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యానికి సోదరుడు.

ఈమె పాటల్లో ఒక ఉయ్యాలపాటలో[6] కొంత భాగం:

వీరమరణం చెందిన 'మట్టారెడ్డి', 'అనంతరెడ్డి'లను స్మరిస్తూ బతకమ్మ పాటశైలిలో ఇలా వివరించింది.

వీరిమట్టారెడ్డి ఉయ్యాలో
ధీర అనంతారెడ్డి ఉయ్యాలో
మీవంటి వీరులు ఉయ్యాలో
మా మధ్య నిలబడి ఉయ్యాలో
మాకు వెలుగులు చూపి ఉయ్యాలో
ఓర్వదీ ప్రభుత్వంబు ఉయ్యాలో
పాత సూర్యాపేట ఉయ్యాలో
పోరాటమును చూడు ఉయ్యాలో
ప్రజల బలమును జూసి ఉయ్యాలో
పారిపోయిరి వాళ్ళు ఉయ్యాలో
మన ప్రజల రాజ్యమును
పొంది తీరాలమ్మ ఉయ్యాలో

మరణం

[మార్చు]

మల్లు స్వరాజ్యం వయో భారంతోపాటు ఊపిరితిత్తుల సమస్యతో దీర్ఘకాలంగా బాధపడుతున్న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 2022 మార్చి 19న మరణించింది.[7][8]

మూలాలు

[మార్చు]
  1. Mallu Swarajyam Died: మల్లు స్వరాజ్యం కన్నుమూత Archived 2022-03-24 at the Wayback Machine (in Telugu)
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-02-09. Retrieved 2014-11-17.
  3. "వీరనారి.. మల్లు స్వరాజ్యం |". web.archive.org. 2023-11-17. Archived from the original on 2023-11-17. Retrieved 2023-11-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "ఆరవ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుల జాబితా". Archived from the original on 2013-10-12. Retrieved 2014-11-18.
  5. "ఏడవ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుల జాబితా". Archived from the original on 2013-12-06. Retrieved 2014-11-18.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2014-11-17.
  7. BBC News తెలుగు (19 March 2022). "తెలంగాణ సాయుధ పోరాట సభ్యురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
  8. Eenadu (19 March 2022). "తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.

ఇతర లింకులు

[మార్చు]