సహాయం:పేజీ చరితం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శీర్షిక పాఠ్యం
[మార్చు]

ఈ పేజీ కూర్పు నియంత్రణకు సంబంధించినది.

వికీపీడియాలో దిద్దుబాట్లు చెయ్యగలిగే ప్రతిపేజీకి, సంబంధిత పేజీ చరితం ఉంటుంది. పేజీలో జరిగిన అన్ని మార్పులు తేదీ, సమయాల తిరగేసిన క్రమంలో పేజీ చరితంలో కనిపిస్తాయి. దీన్ని కూర్పు చరితం అని, దిద్దుబాటు చరితం అని కూడా పిలుస్తారు.

సంక్షిప్త పాఠం

[మార్చు]
  • ఒకప్పటి కూర్పును చూసేందుకు సంబంధిత తేదీని నొక్కండి.
  • పాత కూర్పును ప్రస్తుత కూర్పుతో పోల్చేందుకు ప్రస్తు ను నొక్కండి.
  • ఒక కూర్పును దాని ముందరి కూర్పుతో పోల్చేందుకు గత ను నొక్కండి.
  • ఏవైనా రెండు కూర్పులను పోల్చేందుకు కొత్త కూర్పు యొక్క కుడి రేడియో బటన్ను, పాత కూర్పు యొక్క ఎడమ రేడియో బటన్ను ఎంచుకుని, "ఎంచుకున్న కూర్పులను పోల్చు చూడు" ను నొక్కండి.
  • చిన్న మార్పులు చి అనే అక్షరంతో గుర్తించబడి ఉంటాయి.

సవివర పాఠం

[మార్చు]

పేజీ చరితంలో పేజీ యొక్క పాత కూర్పులు, దిద్దుబాటు జరిగిన తేదీ, సమయం, సభ్యనామం లేదా ఐపీ అడ్రసు, దిద్దుబాటు సారాంశం ఉంటాయి. పేజీకి పైనున్న "చరితం" ట్యాబును నొక్కి చరితం పేజీకి వెళ్ళవచ్చు.

పేజీ చరితాన్ని వాడడం

[మార్చు]

నమూనా పేజీ చరితం ను కింద చూడవచ్చు

దిద్దుబాట్లు సరికొత్త దానినుండి అన్నిటి కంటే పాతదాని వరకు వరుసలో ఉంటాయి. ఒక్కో దిద్దుబటు వివరం ఒక్కో వరుసలో ఉంటుంది. దీనిలో తేదీ సమయం, వాడుకరి పేరు లేదా ఐపీ అడ్రసు, దిద్దుబాటు సారాంశం మొదలైన వాటితో పాటు ఇతర సమాచారం కూడా ఉంటుంది. ఈ పేజీలో ఉండే అంశాల గురించి చూద్దాం:

  1. పేజీ పేరు అలానే ఉంటుంది. చరితం టాబు స్ఫుటంగా కనిపిస్తుంది.
  2. ఈ లింకుల ద్వారా సరికొత్త (చిట్టచివరి), అతిపాత (తొట్టతొలి) పేజీలకు, గత, తరువాతి దిద్దుబాటు పేజీలకు వెళ్ళవచ్చు.
  3. ఒక్కో పేజీకి చూపించిన దిద్దుబాట్ల సంఖ్యను నీలపు రంగు అంకెలు సూచిస్తాయి - 20, 50, 100, 250 లేదా 500. ఎక్కువ దిద్దుబాట్ల సంఖ్యను ఎంచుకుంటే పేజీ పొడవు పెరుగుతుంది, పేజీల సంఖ్య తగ్గుతుంది.
  4. (ప్రస్తు) లింకు తేడా పేజీకి వెళ్తుంది. అక్కడ ఈ దిద్దుబాటు నాటి కూర్పుకు, ప్రస్తుతపు కూర్పుకు మధ్య గల తేడాలను చూపిస్తుంది. పేజీ ప్రస్తుతం ఎలా కనిపిస్తుందో తెలిసేలా, ప్రస్తుత కూర్పు మార్పుల కిందే కనిపిస్తుంది.
  5. (గత) లింకు ఈ దిద్దుబాటు నాటి కూర్పుకు, దాని ముందు కూర్పుకు గల తేడాలను చూపించే పేజీకి వెళ్తుంది. రెండింటిలోను, మార్పులకు దిగువనే కొత్త కూర్పు కనిపిస్తుంది.
  6. రెండు నిలువు వరుసల్లో ఉన్న రేడియో బటన్లను ఎంచుకుని ఏ రెండు కూర్పుల మధ్య గల తేడా నైనా చూడవచ్చు. ఏ రెండు రేడియో బటన్లనైనా ఎంచుకుని, ఎంచుకున్న కూర్పులను పోల్చి చూడు" అనే మీటను నొక్కగానే ఆ రెండు కూర్పుల మధ్య గల తేడాను చూపించే పేజీకి వెళ్తుంది.
  7. దిద్దుబాటు చేసినప్పటి తేదీ, సమయం చూపిస్తుంది. అభిరుచుల్లో పెట్టుకున్న విధానాన్ని బట్టి స్థానిక సమయం చూపిస్తుంది.
  8. దిద్దుబాటు చేసిన వాడుకరి సభ్యనామం గానీ, ఐపీఅడ్రసు గాని కనిపిస్తుంది.
  9. ఇది దిద్దుబాటు సారాంశం. దిద్దుబాటు చేసినపుడు దిద్దుబాటు సారాంశం పెట్టెలో వాడుకరి రాసిన పాఠ్యమే ఇది.
  10. ఈ దిద్దుబాటు సారాంశం బూడిద రంగు పాఠ్యంలో బాణం గుర్తుతో మొదలౌతున్నది. అంటే దానర్థం ఈ వాడుకరి పేజీలోని ఒక విభాగంలో మాత్రమే దిద్దుబాటు చేసారు. విభాగంలో దిద్దుబాటు చేసినపుడు ఈ పాఠ్యం ఆటోమాటిగ్గా చేరుతుంది. వాడుకరి కూడా సారాంశం చేర్చవచ్చు. ఇది నల్ల రంగులో ఉంటుంది.
  11. చి అంటే చిన్న మార్పు అన్నమాట. ఏయే దిద్దుబాటు ఎటువంటిదో దీనివలన తెలుస్తుంది.

పేజీ పేరు మార్చేందుకు గతంలో "పేజీ తరలింపు" అంశాన్ని వాడిఉంటే తరలింపుకు ముందూ, తరువాతా కూడా ఉన్న చరితాన్ని చూపిస్తుంది. పాత పేజీ దారిమార్పు పేజీగా మారి, దాని చరితాన్ని కోల్పోతుంది. రెండు పేజీలను విలీనం చేసినపుడు, ఒకటి దారిమార్పుగా మారుతుంది. కానీ చరితం మాత్రం దానికే ఉంటుంది.

తొలగించిన పేజీల్లో చేసిన దిద్దుబాట్లు సదరు సభ్యుని రచనల పేజీల్లో కనబడవు. అయితే, కూర్పుల చరితం మాత్రం జాగ్రత్తగానే ఉంటుంది. తొలగించిన పేజీని పునస్థాపించగలిగే, నిర్వాహకులు దాన్ని చూడవచ్చు.

పేజీ తిరుగుసేత

[మార్చు]

మీరు చేసిన దిద్దుబాట్లు మీకు నచ్చలేదనుకోండి; ఏమ్ పర్లేదు, మీరు వాటిని పూర్వపు కూర్పుకు 'తిరగ్గొట్టవచ్చు'

సంకీర్ణ పేజీలు (ట్రాన్స్ క్లూజన్)

[మార్చు]

ఓ పేజీని తెచ్చి, మరో పేజీలోని ఓ విభాగంలో ఇముడ్చవచ్చు. దీన్నే ట్రాన్స్ క్లూజన్ అంటారు. సంకీర్ణ పేజీలు చూడండి. ఈ విభాగానికి విడిగా చరితం ఉంటుంది. ఈ ఇమిడ్చిన పేజీ వీక్షణ విడిగానే జరగాలి. m:Help:A simple composite example చూడండి.

బొమ్మ చరితం

[మార్చు]

అప్లోడు చేసిన బొమ్మలో దిద్దుబాట్లు చెయ్యవచ్చు. అంటే ఉన్న బొమ్మ స్థానంలో అదే పేరుతో మరో బొమ్మను అప్లోడు చెయ్యడం. అప్పుడు కూడా అన్ని కూర్పులు ఉంటాయి. బొమ్మ చరితం బొమ్మ వివరణ పేజీ లోని భాగమే.

తొలగించిన బొమ్మల చరితం ఉండదు. అలాంటి బొమ్మలకు సంబంధించినంత వరకు వాటికి చెందిన రికార్డులు అప్లోడు లాగ్, తొలగింపు లాగ్, "తొలగింపు కొరకు వోట్లు" మాత్రమే. వాటి కూర్పు ఏదీ జాగ్రత్త చెయ్యము. అందుచేత తొలగించిన బొమ్మను పునస్థాపించలేము.

పేజీ యొక్క ఫలానా కూర్పుకు లింకు చెయ్యడం

[మార్చు]

ఒక్కోసారి ఓ పేజీ యొక్క ఓ ప్రత్యేక కూర్పుకు లింకు ఇవ్వవలసిన అవసరం కలగవచ్చు. ఉదాహరణకు, ఏదైనా వ్యాసాన్ని సమీక్షించినపుడు ఏ కూర్పును సమీక్షించారో ఇవ్వవలసిన అవసరం ఉంది.

కూర్పు ప్రస్తుతపు కూర్పు కానిచో, పేజీ చరితం ద్వారా పాత కూర్పును చూడవచ్చు. ఈ పాత కూర్పు యొక్క URL ద్వారా ఈ కూర్పును సూచించవచ్చు.


ప్రత్యేక:ఎగుమతి

[మార్చు]

పేజీని ఎగుమతి చేసినపుడు ఒక XMLఫైలు మీడియావికీ ఇంటరుఫేసు లేకుండా, ప్రస్తుత కూర్పుతో, కావాలంటే పాత కూర్పులతోటి తయారవుతుంది. అది ఎలా కనబడుతుందనేది బ్రౌజరుపై ఆధారపడి ఉంటుంది. బ్రౌజరు "సోర్సు చూడు" అంశం ద్వారా XML సోర్సును చూడవచ్చు.

సంగ్రహించడం

[మార్చు]

పేజీ చరితాన్ని సంగ్రహించే కంటే పేజీలోని పాఠ్యాన్ని వేరే పేజీలో సంగ్రహించడమే మేలు: సదరు పేజీల్లోని పాఠ్యాన్ని సెర్చి ఇంజన్ల ద్వారా వెతకవచ్చు. పేజీ చరితాన్ని ఎగుమతి చేసాకే వెతకగలము. పైగా, సంగ్రహించిన పేజీలను ఆ తరువాత ఒక పద్ధతిలో పెట్టుకోవచ్చు.

వీక్షణలో ఉన్న పేజీలు

[మార్చు]

వీక్షణలో ఉన్న పేజీలను చూడకుండా, వాటి చరితాన్ని నేరుగా చూస్తే, అన్నిటికంటే పైన ఉన్న దిద్దుబాటుకు ఒక తాజాకరణ గుర్తు ("కిందటిసారి నేను చూసిన తరువాత జరిగిన తాజాకరణ") ఉండవచ్చు. కిందటిసారి మీరు పేజీని చూసిన తరువాత జరిగిన మార్పుగా గుర్తిస్తూ ఇది ఉంటుంది. అయితే మీరు చూడని అన్ని దిద్దుబాట్లకూ ఈ గుర్తు ఉండదు; కేవలం అన్నిటికంటే పైన ఉన్న ఒక్క దానికే ఉంటుంది. అందుచేత ఇది కాస్త తప్పుదారి పట్టించేదిగా ఉంటుంది.

వెబ్ ఫీడు

[మార్చు]

పేజీ చరితానికి సంబంధించిన వెబ్ ఫీడును పొందే విధానం ఇది: చరితం పేజీ url కు "&feed=rss" లేదా "&feed=atom" చేర్చాలి. ఇది గత 10 దిద్దుబాట్ల తేడాలను పూర్తి తేడాల పేజీకి లింకుతో సహా చూపిస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • http://tools.wikimedia.de/~daniel/WikiSense/Contributors.php - పేజీలో కింది పనులు చేసేందుకు పరికరం:
    • పేజీ చరితాన్ని పేర్చుకోవడం
    • ఒక్కో వాడుకరి చేసే దిద్దుబాట్ల లెక్కింపు

ఇది దాదాపు అన్ని వికీమీడియా సైట్లకు పనిచేస్తుంది; ఇతర మీడియావికీ సైట్లకు వాడేందుకు ఈ పరికరాన్ని డౌనులోడు చేసుకోవచ్చు.]