నారాయణ్ సడోబా కాజ్రోల్కర్
నారాయణ్ సడోబా కాజ్రోల్కర్ | |
---|---|
జననం | 1896, జూలై 9 |
మరణం | 1983 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త |
నారాయణ్ సడోబా కాజ్రోల్కర్, మహరాష్ట్రకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, గాంధేయవాది, సామాజిక కార్యకర్త, సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసి బిఆర్ అంబేద్కర్‌ను ఓడించిన వ్యక్తిగా ప్రసిద్ధి పొందాడు.[1] పుట్టుకతో మరాఠీ అయిన నారాయణ్, అంబేద్కర్‌కు వ్యక్తిగత సహాయకుడిగా కూడా పనిచేశాడు.[2]
జననం
[మార్చు]నారాయణ్ 1896, జూలై 9న మహారాష్ట్రలోని బి. అహ్మద్ నగర్ లో జన్మించాడు. ఇతడి తండ్రిపేరు సడోబా.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]నారాయణ్ కు లక్ష్మీబాయితో వివాహం జరిగింది. వారికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.
రాజకీయరంగం
[మార్చు]1952లో ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుండి మొదటి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు, తరువాత 15,000 పైగా ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4] 1962 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి రెండోసారి కూడా ఎన్నికయ్యాడు.[5]
పదవులు - హోదాలు
[మార్చు]- వైస్ ప్రెసిడెంట్, భారతీయ డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్
- గౌరవ కార్యదర్శి, అణగారిన వర్గాల మిషన్ సొసైటీ ఆఫ్ ఇండియా
- సభ్యుడు, కేంద్ర హరిజన సంక్షేమ బోర్డు, భారత ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర రాష్ట్రం
- సభ్యుడు, కమిటీ సెంట్రల్ హరిజన సేవా సంఘం, న్యూఢిల్లీ;
- అధ్యక్షుడు, హరిజన సేవా సంఘం బొంబాయి
- అధ్యక్షుడు, రోహిదాస్ సమాజ్, బొంబాయి
- సభ్యుడు, గాంధీ స్మారక్ నిధి, బొంబాయి
- ఖాదీ కమిషన్ లెదర్ అడ్వయిజరీ బోర్డు సభ్యుడు
- ఎమ్మెల్సీ బొంబాయి (1947-52)
- ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ నుండిమొదటి లోక్‌సభ సభ్యుడు (1952-57)
- ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ నుండిమూడవ లోక్‌సభ సభ్యుడు (1962-67)
సామాజికసేవ
[మార్చు]మహార్ సమాజంలో జన్మించిన నారాయణ్, షెడ్యూల్డ్ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 1953 మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యుడిగా పనిచేశాడు.[6][7] 1953, ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్[8] పుట్టినరోజును జరుపుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు దళిత వర్గ సంఘ సభ్యుడిగా, వెనుకబడిన తరగతుల ప్రజల సంస్థ కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు.
పురస్కారాలు
[మార్చు]సమాజానికి నారాయణ్ చేసిన కృషికి భారత ప్రభుత్వం 1970లో భారతదేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ప్రదానం చేసింది.[9]
మరణం
[మార్చు]నారాయణ్ 1983లో మరణించాడు.[10]
మూలాలు
[మార్చు]- ↑ "The first Lok Sabha elections (1951–52)". Indian Express. 27 March 2014. Retrieved 3 October 2021.
- ↑ "B. R. Ambedkar". Times of Maharashtra. 14 November 2014. Archived from the original on 5 ఏప్రిల్ 2016. Retrieved 3 October 2021.
- ↑ "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2021-10-03.
- ↑ Akshaya Mukul (2015). Gita Press and the Making of Hindu India. HarperCollins Publishers India. p. 552. ISBN 9789351772316.
- ↑ "Members of the Third Lok Sabha". Empowering India. 2016. Archived from the original on 3 అక్టోబరు 2021. Retrieved 3 October 2021.
- ↑ Christophe Jaffrelot (2003). India's Silent Revolution: The Rise of the Lower Castes in North India. C. Hurst & Co. Publishers. p. 505. ISBN 9781850656708.
- ↑ Sankar Ghose (1993). Jawaharlal Nehru, a Biography. Allied Publishers. p. 353. ISBN 9788170233695.
- ↑ Indrani Jagjivan Ram (2010). Milestones: A Memoir. Penguin Books India. p. 297. ISBN 9780670081875.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 3 October 2021.
- ↑ Lok Sabha, India. Parliament (2003). "Indian Parliamentary Companion: Who's who of Members of Lok Sabha".